Gautami Tadimalla : న‌టి గౌత‌మి బీజేపీకి గుడ్ బై

అన్నామ‌లైకి రాజీనామా లేఖ

Gautami Tadimalla : త‌మిళ‌నాడు – భార‌తీయ జ‌న‌తా పార్టీకి బిగ్ షాక్ త‌గిలింది. ప్ర‌ముఖ న‌టుడు లోక నాయ‌కుడి నుండి విడాకులు పొందిన న‌టి గౌతమి తాడిమ‌ళ్ల(Gautami Tadimalla) సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకుంది. ఆమె కొన్నేళ్లుగా బీజేపీలో కొన‌సాగుతోంది. ఆ పార్టీ కోసం క‌ష్ట‌ప‌డుతూ వ‌స్తోంది. ఇదిలా ఉండ‌గా సోమవారం విజ‌య ద‌శ‌మి రోజున బీజేపీపై కీల‌క వ్యాఖ్య‌లు చేసింది. తాను కాషాయాన్ని వీడుతున్న‌ట్లు స్ప‌ష్టం చేసింది. ఈమేర‌కు ట్విట్ట‌ర్ వేదిక‌గా స్ప‌ష్టం చేసింది. ఇందులో ఎందుకు పార్టీని వ‌దులు కుంటున్నాన‌నే విష‌యం గురించి ప్ర‌త్యేకంగా ప్ర‌స్తావించింది.

Gautami Tadimalla Sensational Decision

విచిత్రం ఏమిటంటే తాను ఇన్నేళ్ల పాటు పార్టీ కోసం ప‌ని చేసినా ప‌ట్టించు కోలేద‌ని వాపోయింది. త‌న‌ను మోసం చేసిన వ్య‌క్తికి బీజేపీ అండ‌గా నిల‌వ‌డం త‌న‌ను విస్తు పోయేలా చేసింద‌ని పేర్కొంది. ఇది ఏ ర‌క‌మైన న్యాయ‌మో పార్టీనే చెప్పాల‌ని నిల‌దీసింది న‌టి గౌత‌మి తాడిమ‌ళ్ల‌.

త‌న రాజీనామా లేఖ‌ను పార్టీ జాతీయ అధ్య‌క్షుడు జేపీ న‌డ్డాకు, త‌మిళ‌నాడు రాష్ట్ర చీఫ్ కె. అన్నామ‌లైకి పంపించారు. త‌న ప్రాప‌ర్టీ, న‌గ‌దు విష‌యంలో చీటింగ్ చేసిన అల‌గ‌ప్ప‌న్ కు బీజేపీ నేత‌లు స‌హ‌క‌రిస్తున్నారంటూ సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేశారు.

Also Read : Chandra Babu Naidu : జైల్లో లేను జ‌నం గుండెల్లో ఉన్నా

Leave A Reply

Your Email Id will not be published!