Election Surveys Comment : స‌ర్వేల గోల జ‌నం విల‌విల

తెలంగాణ లో ఎన్నిక‌ల వేళ

Election Surveys Comment : ఎవ‌రు గెలుస్తున్నారు. జ‌నం మూడ్ ఎటు వైపు ఉంటోంది. ఎవ‌రు ఏం అనుకుంటున్నారు. అధికారంలో ఉన్న పార్టీ స‌రిగా వ్య‌వ‌హ‌రిస్తుందా..లేక ప్ర‌తిప‌క్షాల‌కు ఎడ్జ్ ఉందా అన్న దానిపై ఒక‌టే చ‌ర్చోప చ‌ర్చ‌లు ఓ వైపు కొన‌సాగుతుండ‌గా మ‌రో వైపు స‌ర్వే సంస్థ‌లు సంద‌డి చేస్తున్నాయి. ఒక ర‌కంగా చెప్పాలంటే హ‌ల్ చ‌ల్ చేస్తున్నాయి. ఆయా పార్టీలు వీటిపై ఎక్కువ‌గా ఆధార ప‌డ్డాయి. కింది స్థాయి ఓట‌ర్ల నుంచి పై స్థాయిలో ఉన్న అధినేత‌లు, నేత‌లు, అభ్య‌ర్థుల ఖ‌రారు కూడా వీటికి ఎక్కువ‌గా ప్ర‌యారిటీ ఇవ్వ‌డంతో రాను రాను ఎన్నిక‌ల స్ట్రాట‌జిస్ట్ (వ్యూహ‌క‌ర్త‌)లు, సెఫాల‌జిస్ట్ ల‌కు ఎక్క‌డ లేని గిరాకీ పెరిగింది. దీనికి ప్ర‌ధాన కార‌కుడు ఎవ‌రైనా ఉన్నారంటే ముందుగా చెప్పాల్సింది ఐ ప్యాక్ సంస్థ ఫౌండ‌ర్ ప్ర‌శాంత్ కిషోర్.

Election Surveys Comment Viral In Telangana

త‌ను దేశ రాజ‌కీయాల‌లో ఓ ట్రెండ్ సెట్ట‌ర్. ఆయ‌నే చాలా సంస్థ‌ల‌కు ప్రేర‌ణ‌గా నిలిచార‌న‌డంలో సందేహం లేదు. ఇవాళ కొన్ని వంద‌ల సంస్థ‌లు పుట్టుకు వ‌చ్చాయి. ఇవాళ అభ్య‌ర్థుల సంగ‌తి ఏమిటో కానీ ప్ర‌ధాన పార్టీల‌న్నీ స‌ర్వేల జ‌పం చేస్తున్నాయి. అభ్య‌ర్థుల ఎంపిక‌పై అవి ఇచ్చే రిపోర్టుల‌పై ఆధార‌ప‌డ్డాయి. ప్ర‌తి పార్టీకి ఓ సంస్థ గంప గుత్త‌గా ప‌ని చేస్తోంది.

ప్ర‌స్తుతం దేశంలోని 5 రాష్ట్రాలు తెలంగాణ‌, ఛ‌త్తీస్ గ‌డ్ , మిజోరం, రాజ‌స్థాన్, మ‌ధ్య ప్ర‌దేశ్ ల‌లో శాస‌న స‌భ ఎన్నిక‌లు నిర్వ‌హిస్తోంది ఎన్నిక‌ల సంఘం. ఇక పోతే స‌ర్వేల లొల్లి ఎక్కువ‌గా తెలంగాణ(Telangana) రాష్ట్రంలో కొన‌సాగుతోంది. జ‌నం చెవుల్లో మారు మ్రోగించేలా చేస్తోంది. ఇప్ప‌టికే ముంద‌స్తుగా ఆయా సంస్థ‌లు స‌ర్వేల పేరుతో ప్ర‌భావితం చేసే ప‌నులు చేయొద్దంటూ కేంద్ర ఎన్నిక‌ల సంఘం పేర్కొంది. గీత దాటితే వేటు త‌ప్ప‌ద‌ని హెచ్చ‌రించింది.

అయితే తాము ప్ర‌జ‌లు అంటే ఓట‌ర్లు ఏమ‌ని అనుకుంటున్నార‌నే అభిప్రాయాల‌ను మాత్ర‌మే బ‌య‌ట‌కు ప్ర‌క‌టిస్తున్నామ‌ని, ఇది భావ ప్ర‌క‌ట‌నా స్వేచ్ఛ‌ను ప్ర‌తిఫ‌లిస్తోంద‌ని పేర్కొంటున్నాయి. ఇది త‌మ హ‌క్కు అని స్ప‌ష్టం చేస్తున్నాయి. ప్ర‌స్తుతం దేశ‌, రాష్ట్ర స్థాయిల‌లో ఎన్ని సంస్థ‌లు ముంద‌స్తుగానే తామే ప్ర‌క‌టిస్తున్నాయి ఫ‌లితాల‌ను. ఆయా పార్టీల‌కు ఎన్నెన్ని సీట్లు వ‌స్తాయ‌ని కూడా చెప్పేస్తున్నాయి. ఇది పూర్తిగా ప్ర‌జ‌ల‌పై ప్ర‌ధానంగా ఓట‌ర్ల‌పై ప్ర‌భావితం చేస్తుంద‌ని మేధావులు ఆందోళ‌న వ్య‌క్తం చేస్తున్నారు.

ఏది ఏమైనా స‌ర్వే సంస్థ‌లు స‌ర్వేలు, ఓట‌ర్ల స‌ర‌ళి ఎలా ఉన్నా చివ‌ర‌కు తాము ఎవ‌రికి ఓటు వేస్తామ‌నేది ఎవ‌రూ బ‌య‌ట‌కు చెప్ప‌రు. కార‌ణం బ‌య‌ట‌కు చెబితే అధికారంలో ఉన్న పార్టీ ఒక‌వేళ క‌క్ష క‌డుతుందేమోన‌న్న బెంగ కూడా. ఏది ఏమైనా స‌ర్వే సంస్థ‌ల దూకుడు ఒకింత అనుమానాన్ని క‌లిగిస్తోంది. ఆయా పార్టీలు కోట్లు కుమ్మ‌రించి త‌మ‌కు అనుకూలంగా చెప్పించు కుంటున్నాయ‌న్న అప‌వాదు కూడా ఉంది.

Also Read : Gautami Tadimalla : న‌టి గౌత‌మి బీజేపీకి గుడ్ బై

Leave A Reply

Your Email Id will not be published!