Indian Embassy : భారతీయుల కోసం హెల్ప్ లైన్లు
స్పష్టం చేసిన కేంద్ర సర్కార్
Indian Embassy : న్యూఢిల్లీ – హమాస్ ఉగ్రవాదులు పెద్ద ఎత్తున ఇజ్రాయెల్ పై దాడులకు పాల్పడుతున్నారు. ఇప్పటి దాకా 2 వేల మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. 17 వేల మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. ఇంకా దాడుల పరంపర కొనసాగుతూనే ఉంది.
మరో వైపు ప్రవాస భారతీయులు ఇజ్రాయెల్ లో తలదాచుకున్నారు. వారిని క్షేమంగా తీసుకు వచ్చేందుకు కేంద్రంలో కొలువు తీరిన సర్కార్ ప్రయత్నం చేస్తోంది. ఇదే విషయాన్ని కేంద్ర మంత్రి మీనాక్షి లేఖి ఇటీవలే ప్రకటించారు.
Indian Embassy has set up a helpline
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తున్నారని, ఎవరికీ ఇబ్బంది లేకుండా ,ఆటంకాలు కలగకుండా క్షేమంగా భారత దేశానికి తీసుకు వచ్చేలా చేస్తామన్నారు. ఎవరూ ఎలాంటి ఆందోళనకు గురి కావద్దని కోరారు.
ఇదిలా ఉండగా ఇజ్రాయెల్ లో ఉన్న భారతీయుల సహాయార్థం భారత రాయబార కార్యాలయం(Indian Embassy) , రాష్ట్ర ప్రభుత్వ సంస్థ ఏపీఎన్ఆర్టీఎస్ హెల్ప్ లైన్ నంబర్లను ఏర్పాటు చేసింది. భారతీయులకు పలు సూచనలు చేసింది ఎంబీసీ.
భారతీయ పౌరులు అప్రమత్తంగా ఉండాలని, ఇజ్రాయెల్ ప్రభుత్వ భద్రతా నియమాలను అనుసరించి జాగ్రత్త వహించాలని కోరింది మోదీ సర్కార్.
Also Read : Sajjala Ramakrishna Reddy : బాబుపై సజ్జల సెటైర్