అల్లు అర్జున్ ‘రాకా’ నిజంగా తమిళ చిత్రమా?

ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న అట్లీ కుమార్

హైద‌రాబాద్ : డైన‌మిక్ ద‌ర్శ‌కుడు అట్లీ కుమార్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన చిత్రం రాకా. ఈ మూవీలో కీల‌క పాత్ర పోషిస్తున్నారు పాన్ ఇండియా హీరో , హీరోయిన్ అల్లు అర్జున్, దీపికా ప‌దుకొనే. దీనిని ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ స‌న్ ఇంట‌ర్నేష‌న‌ల్. దీంతో రాకా గురించి రోజూ ఓ అప్ డేట్ వ‌స్తోంది. ఇది సినీ ప్రియులలో కొత్త చర్చకు దారితీసింది. ఈ చిత్రం ప్రధానంగా తమిళ ప్రాజెక్టా అనే సందేహాలు అట్లీ చేసిన ఇటీవలి వ్యాఖ్యల వల్ల తలెత్తాయి. అట్లీ ఇటీవల సంగీత దర్శకుడు సాయి అభ్యంకర్‌ను ప్రశంసిస్తూ ‘రాకా’ చిత్రాన్ని ఆస్కార్‌ స్థాయికి తీసుకెళ్లి తమిళ ప్రేక్షకులకు గర్వ కారణంగా నిలవాలని కోరుకుంటున్నట్లు పేర్కొన్నారు. సోషల్ మీడియాలో ఆయన వ్యాఖ్యలు వేగంగా వైరల్ కావడంతో సినిమా భాష , విడుదల ప్రణాళికల గురించి ఊహాగానాలు మొదలయ్యాయి.

అయితే ‘రాకా’ను ఒక భారీ పాన్-ఇండియా ప్రాజెక్ట్‌గా ప్రచారం చేస్తున్నారు. అల్లు అర్జున్ ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ చిత్రానికి అట్లీ దర్శకత్వం వహిస్తున్నారు. వీరిద్దరి కలయికలో వస్తున్న మొదటి చిత్రం ఇదే కావడం విశేషం. దీపికా పదుకొణె కూడా ఇందులో కీలక పాత్ర పోషిస్తుండగా, సాయి అభ్యంకర్ సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రాన్ని తెలుగు , తమిళ భాషల్లో ఏకకాలంలో చిత్రీకరిస్తున్నారా లేదా వివిధ భాషా వెర్షన్లను ఎలా నిర్వహించ బోతున్నారనే దానిపై చిత్ర బృందం ఇంకా అధికారికంగా స్పష్టత ఇవ్వలేదు. దీనివల్ల అభిమానుల్లో ముఖ్యంగా తెలుగు మాట్లాడే ప్రాంతాల్లో ఆసక్తి పెరిగింది.

‘రాకా’ చిత్రాన్ని రెండు భాగాలుగా విడుదల చేస్తారా లేక ఒకే చిత్రంగా విడుదల చేస్తారా అనే చర్చ కూడా జరుగుతోంది. దీనిపై చిత్ర నిర్మాతలు ఇంకా ఎటువంటి అధికారిక ప్రకటన చేయలేదు . ప్రస్తుతానికి సినిమా భాష, విడుదల ప్రణాళికలు, కథకు సంబంధించిన మరిన్ని వివరాల కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. భారీ బడ్జెట్ ప్రాజెక్ట్ కోసం అల్లు అర్జున్ , అట్లీ జతకట్టడంతో అత్యంత ఆసక్తిగా ఎదురు చూస్తున్న చిత్రాలలో ‘రాకా’ ఒకటిగా నిలిచింది.

Leave A Reply

Your Email Id will not be published!