గోరంట్ల/శ్రీసత్యసాయి : ‘రహదారులు లేని గ్రామాలకు రోడ్లు వేస్తున్నాం. రహదారులే అభివృద్దికి రాచమార్గాలు.. బూచేపల్లికి రోడ్డు వేసిన తరవాతే వస్తానని చెప్పాను…ఈరోజు చేసి చూపించాను…గత పాలకులు మీటరు రోడ్డు కూడా వేయలేదు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన చేసిన అభివృద్ధిపై నేను చర్చకు ఛాలెంజ్ చేస్తున్నాను.. ప్లేస్ మీరు డిసైడ్ చేసినా. నేను డిసైడ్ చేసినా చర్చకు సిద్ధం…’ అని వైసీపీ నాయకులకు రాష్ట్ర బీసీ, ఈడబ్ల్యూఎస్ సంక్షేమ, చేనేత, జౌళి శాఖ మంత్రి ఎస్.సవిత సవాల్ విసిరారు. అయిదేళ్ల పాలనలో జగన్ రెడ్డి చేసేందేమీ లేదని, ఆయనదంతా చోరీ క్రెడిట్ అని , తమది అభివృద్ధి క్రెడిట్ అని అన్నారు. ఆయన చోరీ క్రెడిట్ ను చోరీ చేయాల్సిన దౌర్భాగ్య స్థితిలో ఎవరూ లేరన్నారు. శ్రీసత్యసాయి జిల్లా గోరంట్ల మండలం రూ.60 లక్షలతో కరావులపల్లి నుంచి కరావులపల్లి తండా వరకు నిర్మించిన బీటీ రోడ్డు, రూ.2.47 కోట్లతో బూచేపల్లి నుంచి కొత్తపల్లి వరకు నిర్మించిన బీటీ రోడ్డును జిల్లా కలెక్టర్ శ్యామ్ ప్రసాద్ కలిసి మంత్రి సవిత ప్రారంభించారు.
ఈ సందర్భంగా నిర్వహించిన సభలో ఆమె మాట్లాడుతూ రాష్ట్రంలో రహదారుల నిర్మాణాలకు, అభివృద్ధికి సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అధిక ప్రాధాన్యం ఇస్తున్నారన్నారు. రోడ్లే లేని గ్రామాలకు బీటీ, సీసీ రహదారులు నిర్మిస్తున్నారన్నారు. రోడ్లతోనే అభివృద్ధి సాధ్యమవుతుందన్నారు ఎస్. సవిత. గత ఎన్నికల్లో తమ గ్రామానికి రహదారి సౌకర్యం లేక పోవడం వల్ల తీవ్ర ఇబ్బందులు ఎదుర్కుంటున్నామని ఆనాడు బూచేపల్లి గ్రామస్తులు తన దృష్టి తీసుకొచ్చారని మంత్రి సవిత గుర్తు చేశారు. ఆనాడే తాను చెప్పానని, రోడ్డేసిన తరవాత బూచేపల్లికి వస్తానని చేసి చూపించచానని అన్నారు. ఇచ్చిన మాటకు కట్టుబడుతూ రూ.2.50 కోట్లతో బూచేపల్లికి బీటీ రోడ్డు నిర్మించామన్నారు. బూచేపల్లి పంచాయతీలో రూ.4 కోట్లతో అభివృద్ధి పనులు జరుగుతున్నాయన్నారు. గత ఎన్నికల్లో తాను అత్యధిక మెజార్టీతో గెలుపొందడానికి బూచేపల్లి గ్రామస్తులు సహకారం అందించారని అన్ఆరు. వారి రుణం తీర్చుకోలేనిదాని, బూచేపల్లి అభివృద్ధి శాయశక్తులా కృషి చేస్తానని మంత్రి సవిత తెలిపారు.