అనకాపల్లి జిల్లా : ఏపీ రాష్ట్ర హోం శాఖ మంత్రి వంగలపూడి అనిత సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రతి ఒక్కరు విధిగా హెల్మెట్ లు ధరించాలని అన్నారు. లేకపోతే కఠిన చర్యలు తప్పవన్నారు. మంగళవారం పాయకరావుపేట నియోజకవర్గంలో హోం మంత్రి పర్యటించారు. రోడ్డు ప్రమాదాల నివారణపై అడ్డురోడ్డు నుండి నక్కపల్లి వరకు బైక్ ర్యాలీ చేపట్టారు. బైక్ ర్యాలీలో పాల్గొన్నారు అనిత. సురక్షిత రోడ్లు.. సురక్షిత జీవితం అంటూ హెల్మెట్లతో ర్యాలీ నిర్వహించారు. హెల్మెట్ ధరిద్ధం- సురక్షితంగా పయనిద్దాం అంటూ నినాదాలు చేశారు. ఈ సందర్బంగా వాహనదారులకు హెల్మెట్లు పంపిణీ చేశారు హోం మంత్రి అనిత .చాలామంది రెండు లక్షల రూపాయల విలువ గల బైక్ ను వాడతారు గాని, హెల్మెట్ ను ధరించరని అన్నారు.
ద్విచక్ర వాహనం నడిపే ప్రతి ఒక్కరూ కచ్చితంగా హెల్మెట్ ను ధరించాలని కోరారు. ప్రాణం చాలా ముఖ్యం. ప్రాణం కన్నా ఏది ఎక్కువ కాదన్నారు అనిత. పాయకరావుపేట నియోజకవర్గంలో ఒక నెలలోనే చాలా రోడ్డు ప్రమాదాలు జరిగాయని గుర్తు చేశారు. ఇది చాలా బాధాకరం. ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని స్పష్టం చేశారు . పాయకరావుపేట నియోజకవర్గంలో ఎవ్వరైనా హెల్మెట్ ధరించాల్సిందేనని అన్నారు. నాయకులైనా సరే హెల్మెట్ ధరించకుండా రోడ్డుపైకి వస్తే డబల్ ఫైన్ వేయండి అని ఆదేశించారు. రోడ్డు ప్రమాదాలు వలన చాలా కుటుంబాలు రోడ్డున పడుతున్నాయని అన్నారు. ముందు జాగ్రత్తగా ఉండడం అనేది చాలా ముఖ్యం అన్నారు. ప్రతి ఒక్కరూ హెల్మెట్ ధరించేలాగా అవగాహన కల్పిస్తున్నాం అన్నారు. .
