చెన్నై : తమిళనాడులో జరిగిన ఎన్నికల ఫలితాలలో ఊహించని రీతిలో టీవీకే విజయ్ పార్టీ అత్యధిక స్థానాలను కైవసం చేసుకుంది. స్వంతంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు ఛాన్స్ ఇవ్వాలని కోరాడు విజయ్. ఈ మేరకు ఆయన రాష్ట్ర గవర్నర్ రాజేంద్ర కు లేఖ రాశారు. అయితే ఇంకా ఉత్కంఠ కొనసాగుతోంది. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలంటే 234 స్తానాలకు గాను 108 సీట్లు సాధించింది టీవీకే. ఇంకా 10 సీట్లు కావాల్సి ఉంది. దీంతో ఏ పార్టీ మద్దతు ఇస్తుందనే దానికి తెర దించాడు విజయ్. ఈ మేరకు ప్రజా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు కాంగ్రెస్ పార్టీతో మంతనాలు జరిపారు. చివరకు కాంగ్రె్ పార్టీ సైతం పునరాలోచనలో పడింది.
ఈ సందర్బంగా ఏఐసీసీ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ మీడియాతో మాట్లాడారు. తమిళనాడులో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు టీవీకే చీఫ్ అధ్యక్షుడు విజయ్ భారత జాతీయ కాంగ్రెస్ మద్దతును కోరారని తెలిపారు. తమిళనాడులో లభించిన ప్రజా తీర్పు ఒక లౌకిక ప్రభుత్వాన్ని కోరుకుంటోందని అన్నారు. ఆ ప్రభుత్వం రాజ్యాంగాన్ని అక్షరాలా , స్ఫూర్తితో పరిరక్షించడానికి కట్టుబడి ఉంటుందని స్పష్టం చేశారు కేసీ వేణుగోపాల్. తమిళనాడు ప్రభుత్వాన్ని ఏ రూపంలోనూ భారతీయ జనతా పార్టీ కానీ , దాని పరోక్ష శక్తులు గానీ నడిపేందుకు అనుమతించ కూడదని తమ పార్టీ హైకమాండ్ నిర్ణయం తీసుకుందన్నారు. విజయ్ కూడా ‘పెరుంతలైవర్’ కామరాజ్ నుండి స్ఫూర్తి పొందుతున్నట్లు ప్రస్తావించారు. తదనుగుణంగా, ఎన్నికల ఫలితాల ద్వారా ప్రతిబింబించిన రాష్ట్ర ప్రజల మనోభావాలను దృష్టిలో ఉంచుకుని, విజయ్ అభ్యర్థనపై తుది నిర్ణయం తీసుకోవాలని కాంగ్రెస్ అధిష్టానం టీఎన్సీసీని ఆదేశించిందన్నారు.
