అమరావతి : రాష్ట్రంలో 2.05 లక్షల హస్త కళాకారుల గుర్తించామని, వారికి ఆర్థిక భరోసా కల్పిస్తూ గౌరవ ప్రద జీవనం అందజేయడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని మంత్రి సవిత తెలిపారు. రాష్ట్రంతో పాటు జాతీయ స్థాయిలో 19 లేపాక్షి షో రూమ్ ల ఉన్నాయని, వాటన్నింటినీ ఆధునీకరిస్తున్నామని తెలిపారు. ఇటీవలే రాజమండ్రి ఎయిర్ పోర్టులో లేపాక్షి షో రూమ్ ఏర్పాటు చేశామన్నారు. విదేశాల్లోనూ లేపాక్షి షో రూమ్ లు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. కళాక్షి వాట్సాప్, తరంగా సేవ పేరుతో ఆన్ లైన్ లోనూ హస్త కళల విక్రయాలు చేస్తున్నామన్నారు. లేపాక్షి షో రూమ్ ల పారదర్శకంగా నిర్వహణకు తరంగా ఏపీ ఆధారిత రియల్ టైమ్ వ్యవస్థ రూపకల్పన చేశామన్నారు.
హస్త కళారూపాల అమ్మకాలు పెరిగేలా జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో 65 ఎగ్జిబిషన్ల ఏర్పాటు చేశామన్నారు. 202424-25 లో 56.47 కోట్లు , 2025-26లో రూ.60.78 కోట్ల అమ్మకాల హస్త కళారూపాల అమ్మకాలు జరిపామన్నారు. హస్త కళాకారులను ప్రోత్సహించేలా అవార్డుల బహుకరించామని, 20 మంది కళాకారులకు రూ.3 లక్షల వరకు నగదు బహుమతి అందజేశామని తెలిపారు. వన్ డిస్ట్రిక్ట్ – వన్ ప్రొడెక్ట్(ఓడీ ఓపీ) కింద ప్రతి జిల్లా నుంచి హస్త కళలకు గుర్తింపునకు కృషి చేస్తున్నామన్నారు. విశాఖపట్నం సీఐఐ – 2025 సదస్సు, సింగపూర్ లో జరిగిన భారతదేశ గణతంత్ర వేడుకలకు, హాంకాంగ్ మరియు ఇతర అంతర్జాతీయ వేడుకలకు ఏపీ హస్త కళల గిఫ్ట్ బాక్స్ లు సరఫరా చేశామన్నారు. ఇదిలా ఉండగా తమ సర్కార్ పెద్ద ఎత్తున చేనేత పరిశ్రమ రంగానికి ప్రయారిటీ ఇస్తోందని చెప్పారు రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్. సవిత.
