Janasena: సీఎం జగన్‌పై ఎన్నికల సంఘానికి జనసేన ఫిర్యాదు !

సీఎం జగన్‌పై ఎన్నికల సంఘానికి జనసేన ఫిర్యాదు !

Janasena: ఏప్రిల్‌ 16న భీమవరంలో సీఎం జగన్‌ చేసిన వ్యాఖ్యలపై జనసేన పార్టీ ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసింది. సీఎం వ్యాఖ్యలు కోడ్‌ ఉల్లంఘన కిందకు వస్తాయని పేర్కొంది. ‘‘మోడల్‌ కోడ్‌కు విరుద్ధంగా జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌ వ్యక్తిగత జీవితం గురించి జగన్‌ మాట్లాడారు. రాష్ట్రంలో మహిళల్ని కించపరిచేలా రోడ్‌ షోలో ప్రసంగించారు. సానుభూతితో ఎన్నికల్లో గెలిచేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు’’ అని జనసేన ప్రధాన కార్యదర్శి టి. శివశంకర్… రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ముకేశ్‌ కుమార్‌ మీనాను కలిసి ఫిర్యాదు చేశారు.

ఈ సందర్భంగా జనసేన ప్రధాన కార్యదర్శి టి. శివశంకర్ మాట్లాడుతూ… ఏపీ సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ అక్రమాలకు పాల్పడుతోందని.. తెలుగుదేశం – జనసేన(Janasena)- బీజేపీ కూటమి అభ్యర్థులను భయాభాంత్రుకు గురిచేస్తోందని అన్నారు. సీఎం జగన్ తో పాటు వైసీపీ నాయకులపై ఎన్నికల సంఘం కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు.

Janasena- పోలీసుల వైఖరిపై టీడీపీ ఫిర్యాదు !

ఎన్నికల్లో పోలీసు అధికారుల పక్షపాత వైఖరిపై టీడీపీ మరోమారు సీఈవో మీనాకు ఫిర్యాదు చేసింది. ‘‘మాచర్లలో టీడీపీ నేతలపై దాడి జరిగిన సమయంలో సీఐ భక్తవత్సలరెడ్డి అక్కడే ఉన్నారు. ఆయన్ని ఎన్నికల విధుల్లో ఉంచకూడదు. సీఐ లక్ష్మణ్‌ అధికార పార్టీకి సెల్యూట్‌ చేస్తున్నారు. ఇలాంటి అధికారులు విధుల్లో ఉంటే నిష్పాక్షికంగా ఎన్నికలు జరగవు. చిత్తూరులో సీఐ గంగిరెడ్డి … మంత్రి పెద్దిరెడ్డి కనుసన్నల్లో పనిచేస్తున్నారు’’ అని సీఈవోకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు.

Also Read:KCR: కేసీఆర్‌ బస్సు యాత్ర షెడ్యూల్‌ ఖరారు !

 

Leave A Reply

Your Email Id will not be published!