YS Sharmila: విజయమ్మకు బర్త్‌ డే విషెష్ చెప్పిన షర్మిల !

విజయమ్మకు బర్త్‌ డే విషెష్ చెప్పిన షర్మిల !

YS Sharmila: వైయస్ విజయమ్మకు ఆమె కుమార్తె, ఏపీ పీసీసీ చీఫ్ వైయస్ షర్మిల(YS Sharmila) శుక్రవారం జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. నాకు జన్మనిచ్చి… ఆ జన్మకు సార్థకత చేకూర్చుకోవడానికి నాకు అండగా, చీకటిలో వెలుగుగా, వేదనలో సాంత్వనగా, విలువలను, విశ్వాసాన్ని నింపిన నిస్వార్థ రూపం నువ్వు అమ్మ… నీకు ఆ దేవుడు నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలను, మనః శాంతిని, ఆనందాన్ని ఇవ్వాలని ప్రార్థిస్తూ… హ్యాపీ బర్త్‌డే మా అంటూ తన సోషల్ మీడియా ఎక్స్ వేదికగా భావోద్వేగ పోస్ట్‌ తో వైయస్ షర్మిల కన్నతల్లికి బర్త్‌డే విషెష్ చెప్పారు.

YS Sharmila Wish..

ప్రస్తుతం ఏపీపీసీసీ హోదాలో వైఎస్ షర్మిల ఏపీలో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. కడప లోక్ సభ నుండి బరిలో దిగుతున్న ఈమె… తన సోదరుడు, సీఎం జగన్ తో పాటు వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో నిందితుడిగా ఉన్న అవినాష్ రెడ్డిపై తనదైన శైలిలో విమర్శలు గుప్పిస్తూ ఏపీలో ఎన్నికల వేడిని రాజేస్తున్నారు. ఈ నేపథ్యంలో తనకు అనుకూలంగా ఎన్నికల ప్రచారంలో పాల్గొనాలని సీఎం జగన్ కోరిన నేపథ్యంలో… ఇద్దరికీ న్యాయం చేయలేక వైఎస్ విజయమ్మ… యుఎస్ఏలో ఉన్న షర్మిల కుమారుడు రాజారెడ్డి వద్దకు వెళ్ళిపోయినట్లు ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో విజయమ్మకు సోషల్ మీడియా వేదికగా షర్మిల భర్త్ డే విషెస్ తెలిపినప్పటికీ… జగన్ ఏ విధంగా పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు అనేది ఇంకా తెలియరాలేదు. ఈ నేపథ్యంలో వైఎస్ షర్మిల చేసిన భావోద్వేగ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారుతోంది.

Also Read:Janasena: సీఎం జగన్‌పై ఎన్నికల సంఘానికి జనసేన ఫిర్యాదు !

Leave A Reply

Your Email Id will not be published!