Saudi Arabia: ఖైదీని విడిపించేందుకు రూ. 34 కోట్లు విరాళాలు !

ఖైదీని విడిపించేందుకు రూ. 34 కోట్లు విరాళాలు !

Saudi Arabia: ప్రాణాపాయ స్థితిలో ఉన్న వ్యక్తులను కాపాడటానికి విరాళాలు సేకరించే వారిని చాలా మందిని చూసాము. కాని ఓ ప్రత్యేక అవసరాలుగల బాలుడి మరణానికి పరోక్షంగా కారణమై సౌదీ జైలులో శిక్ష అనుభవిస్తున్న కేరళకు చెందిన ఓ ఖైదీను మరణ శిక్ష నుండి తప్పించేందుకు రూ. 34 కోట్లు విరాళాలు సేకరించారు. సౌదీ అరేబియాలో మరణశిక్ష ఎదుర్కొంటున్న వ్యక్తిని రక్షించేందుకు ప్రపంచవ్యాప్తంగా ఉన్న కేరళీయులు ఏకంగా రూ.34 కోట్లు సమీకరించి పెద్దమనసు చాటుకున్నారు. పూర్తి వివరాల్లోకి వెళితే…

Saudi Arabia Updates..

కేరళలోని కోజికోడ్‌కు చెందిన అబ్దుల్‌ రహీమ్‌ సౌదీలో ప్రత్యేక అవసరాల సౌదీ(Saudi Arabia) బాలుడికి సంరక్షకుడిగా (కేర్‌ టేకర్‌) ఉండేవాడు. 2006లో పొరపాటున అతను చనిపోవడానికి కారణమయ్యాడు. అప్పటి నుంచి ఆయన జైల్లో మగ్గుతున్నాడు. మరోవైపు బాలుడి కుటుంబం క్షమాభిక్షకు అంగీకరించకపోవడంతో… 2018లో అబ్దుల్‌కు అక్కడి న్యాయస్థానం మరణశిక్ష విధించింది. నిందితుడి తరఫు అభ్యర్థనలనూ న్యాయస్థానం తిరస్కరించింది. అనంతరం కొన్నాళ్లకు… ‘బ్లడ్‌ మనీ’ చెల్లిస్తే క్షమించేందుకు బాధిత కుటుంబం అంగీకరించింది. ఈ క్రమంలోనే ఈ నెల 18లోగా సుమారు రూ. 34 కోట్లు చెల్లించినట్లైతే మరణశిక్ష తప్పే అవకాశముంది. దీనితో ఆ మొత్తం సమీకరించి రహీమ్‌ ను విడిపించేందుకు ఓ కార్యాచరణ బృందం నిధుల సమీకరణ మొదలు పెట్టింది. పారదర్శకత కోసం ప్రత్యేకంగా యాప్‌ ను సైతం రూపొందించింది. ఈ క్రమంలో ఐదు రోజుల క్రితం వరకు కూడా… కొద్ది మొత్తమే పోగైంది. ఆ తర్వాత కేరళీయులు పెద్దఎత్తున స్పందించి విరాళాలు అందించారు. ఈ మొత్తాన్ని మృతుని కుటుంబానికి బ్లడ్ మనీగా చెల్లించి మరణశిక్ష నుండి అబ్దుల్ రహీమ్ ను రక్షించడానికి చర్యలు చేపట్టనున్నారు.

Also Read : Minister Rajnath Singh : డైనోసర్ల కాంగ్రెస్ కూడా అంతరించి పోతుందంటున్నయూనియన్ మినిస్టర్

Leave A Reply

Your Email Id will not be published!