Mihir Karmakar : సివిల్ స‌ర్వీసెస్ అభ్య‌ర్థుల‌కు ఆలంబ‌న‌

ఐఏఎస్ అధికారి మిహిర్ క‌ర్మాక‌ర్ స్పూర్తి

Mihir Karmakar : ఎవ‌రైనా సివిల్ స‌ర్వీసెస్ కు ఎంపికైతే చాలు అనుకుంటారు. మ‌రికొంద‌రు ఎంపిక‌య్యాక హోదా, జీతం, గుర్తింపుతో పాటు ఇక సెటిల్ అయ్యామ‌ని సంతోషిస్తారు. కానీ ప‌శ్చిమ బెంగాల్ కు చెందిన ఐఏఎస్ అధికారి మిహిర్ క‌ర్మాక‌ర్ మాత్రం ప్ర‌త్యేకం. ఎందుకంటే ఆయ‌న త‌న విధుల‌తో పాటు త‌న లాగా ఎంద‌రినో సివిల్స్ ప్రిపేర్ అయ్యే వారిని త‌యారు చేసే ప‌నిలో ప‌డ్డారు. స్వంతంగా ఏకంగా కోచింగ్ సెంట‌ర్ల‌ను ఏర్పాటు చేశాడు.

వారిని సివిల్ స‌ర్వెంట్స్ గా తీర్చిదిద్దే ప‌నిలో ప‌డ్డారు మిహిర్ క‌ర్మాకర్. ఇలాంటి వాళ్లు కూడా ఈ దేశంలో ఉంటారా అన్న రీతిలో ఆశ్చ‌ర్య పోయేలా చేశాడు.

2016కు చెందిన ప‌శ్చి బెంగాల్(West Bengal) సివిల్ స‌ర్వీసెస్ (డ‌బ్ల్యూసీఎస్) అధికారి మిహిర్ క‌ర్మాక‌ర్. ఇప్ప‌టి వ‌ర‌కు రెండు కోచింగ్ సెంట‌ర్ల‌న ఏర్పాటు చేశారు. 150 మందికి పైగా ఔత్సాహికుల‌కు సివిల్స్ కోసం ప్రిపేర్ అయ్యేలా చేశారు. ఉత్త‌ర బెంగాల్ లోని అలీపురూద‌ర్ జిల్లాలోని కుమార్ గ్రామ్ లో బీడీఓగా ప‌ని చేస్తున్నారు.

ఉచితంగా సివిల్స్ ఆశావాదుల కోసం శిక్ష‌ణా కేంద్రాల‌ను ఏర్పాటు చేశాడు. ఇందులో ఎక్కువ‌గా పేద‌లు, నిరుపేద కుటుంబాల‌కు చెందిన వారు ఉన్నారు. వారికే త‌ను ప్ర‌యారిటీ ఇస్తారు. ఇక్కడ మెటీరియ‌ల్ తో పాటు అన్నీ ఉచితంగా అందించేలా చేశారు. ఆయ‌న చేస్తున్న ప్ర‌య‌త్నం ఎంద‌రికో స్పూర్తి దాయ‌కంగా ఉంటోంది. రాబోయే రోజుల్లో మ‌రిన్ని ఏర్పాటు చేయాల‌ని కోరుకుందాం.

Also Read : KTR Yellareddipeta School : ఎల్లారెడ్డిపేట బ‌డి అదుర్స్

 

Leave A Reply

Your Email Id will not be published!