Minister KTR : హైదరాబాద్ – రాష్ట్ర ఐటీ, పురపాలిక, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ సంచలన ప్రకటన చేశారు. ప్రస్తుతం ఎన్నికలు జరుగుతున్న తరుణంలో రైతులకు తీపి కబురు చెప్పారు. శాసన సభ ఎన్నికలు ముగిసే లోపు మిగిలి పోయిన రైతులందరికీ రుణ మాఫీ చేస్తామని స్పష్టం చేశారు. ప్రస్తుతం కేటీఆర్(Minister KTR) చేసిన కామెంట్స్ కలకలం రేపుతున్నాయి.
Minister KTR Promises Viral
ఇదిలా ఉండగా కేంద్ర ఎన్నికల సంఘం ఎలాంటి హామీలు ఇవ్వకూడదని, ఉచితాలు, తాయిలాలు ప్రకటించ కూడదని స్పష్టం చేసింది. అలా చేసినట్లయితే చట్ట రీత్యా చర్యలు తీసుకుంటామని ప్రకటించింది. అయినా ఆయా పార్టీలకు చెందిన నేతలంతా హామీల వర్షం కురిపిస్తున్నారు. జనాన్ని బురిడీ కొట్టించే ప్రయత్నం చేస్తున్నారు.
ఇదిలా ఉండగా రాష్ట్రంలో కొలువు తీరిన బీఆర్ఎస్ సర్కార్ ముందస్తుగానే ఎన్నికల షెడ్యూల్ ఖరారు కాక ముందే రైతులకు రుణ మాఫీ ప్రకటించింది. దీని వల్ల వేలాది మంది అన్నదాతలకు మేలు చేకూరింది. మొత్తంగా తాజాగా మంత్రి కేటీఆర్ చేసిన ప్రకటన ఆనందం కలిగిస్తోంది.
Also Read : Karnataka Farmers : కాంగ్రెస్ సర్కార్ పై రైతన్నల కన్నెర్ర