MS Swaminathan : సాగు రంగానికి స్వామినాథ‌న్ స్పూర్తి

వ్య‌వ‌సాయ రంగానికి దిక్సూచి

MS Swaminathan : ఈ దేశంలో గ‌ర్వించ ద‌గిన వ్య‌వ‌సాయ శాస్త్ర‌వేత్త‌ల‌లో ఎన్న‌ద‌గిన వ్య‌క్తి డాక్ట‌ర్ ఎంఎస్ స్వామినాథ‌న్. ప్ర‌స్తుతం ఆయ‌న చెన్నై లోని ర‌త్న‌న‌గ‌ర్ లో ఉంటున్నారు. స్వామినాథ‌న్ రీసెర్చ్ ఫౌండేష‌న్ ఏర్పాటు చేశారు. వ్య‌వ‌సాయ రంగానికి సంబంధించి ప‌రిశోధ‌న‌లు చేస్తున్నారు. సాగు రంగంలో కీల‌క మార్పుల‌కు శ్రీ‌కారం చుట్టారు స్వామినాథ‌న్(MS Swaminathan). ఐక్య రాజ్య స‌మితి సైతం ఆయ‌న అందించిన సూచ‌న‌లు, స‌ల‌హాల‌ను తీసుకుంది. గ‌తంలో ఎఫ్ఏఓ చైర్మ‌న్ గా ప‌ని చేశారు కూడా.

MS Swaminathan Foundation

ప్ర‌స్తుతం ఎంఎస్ స్వామి నాథ‌న్ కు 90 ఏళ్లు. ఇప్ప‌టికీ ఆయ‌నకు సాగు రంగ‌మంటే ఎన‌లేని అభిమానం. ఈ వ‌య‌సులో కూడా ఎక్క‌డా తొట్రుపాటు లేకుండా తెలుసు కోవాల‌న్న కోరిక‌తో ఉండ‌డం మామూలు విష‌యం కాదు. ఈ దేశంలో కోట్లాది మంది ప్ర‌జ‌ల ఆక‌లి తీర్చిన మ‌హోన్న‌త మాన‌వుడు ఆయ‌న‌. వ్య‌వ‌సాయ సంస్క‌ర‌ణ‌ల‌కు స‌స్య విప్లవ పితామ‌హుడు అని చెప్ప‌డంలో సందేహం లేదు.

ఆయ‌న కృషి వ‌ల్ల‌నే ఇక్రిషాట్ ఏర్ప‌డింది. నూత‌న ఆవిష్క‌ర‌ణ‌ల‌కు ఐకార్ డైర‌క్ట‌ర్ గా శ్రీ‌కారం చుట్టారు ఎంఎస్ స్వామినాథ‌న్. వ్య‌వ‌సాయ విస్త‌ర‌ణ‌, విద్య‌, సాంకేతిక ప‌రిజ్ఞానం అన్నింటికీ స్వామినాథ‌నే కార‌ణం. 2004లో యూపీఏ ఏర్పాటు చేసిన వ్య‌వసాయ క‌మిష‌న్ కు నాయ‌క‌త్వం వ‌హించారు. కాగా ఆయ‌న ఇచ్చిన నివేదిక‌ను మోదీ స‌ర్కార్ ప‌క్క‌న పెట్ట‌డం బాధాక‌రం. రైతు కేంద్రంగా నిర్ణ‌యాలు జ‌ర‌గ‌డం లేదు. ఆయ‌న వ్య‌వ‌సాయ రంగానికి ఎల్ల‌ప్ప‌టికీ స్పూర్తిగా నిలుస్తున్నారు.

Also Read : Priyanka Gandhi : 30న కొల్లాపూర్ లో ప్రియాంక స‌భ

 

Leave A Reply

Your Email Id will not be published!