Nara Lokesh : బాబును చంపేందుకు కుట్ర‌

త‌న‌యుడు నారా లోకేష్

Nara Lokesh : ఆంధ్రప్ర‌దేశ్ – టీడీపీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి నారా లోకేష్ నిప్పులు చెరిగారు. త‌మ పార్టీ జాతీయ అధ్య‌క్షుడు , మాజీ సీఎం నారా చంద్ర‌బాబు నాయుడును కావాల‌ని క‌క్ష సాధింపు ధోర‌ణితోనే జైలు పాలు చేశారంటూ ఆవేద‌న వ్య‌క్తం చేశారు. నారా లోకేష్ మీడియాతో మాట్లాడారు.

Nara Lokesh Slams CM YS Jagan

ఎలాంటి ఆధారాలు లేకుండానే అరెస్ట్ చేశారంటూ ఆరోపించారు. ఇవాల్టితో 50 రోజులు పూర్త‌య్యాయ‌ని , కానీ ఏదో ఒక రోజు త‌న తండ్రి నిర్దోషిగా బ‌య‌ట‌కు వ‌స్తార‌న్న న‌మ్మ‌కం త‌న‌కు ఉంద‌న్నారు. ప్ర‌జ‌లు జ‌గ‌న్ రెడ్డి చేస్తున్న అరాచ‌కాన్ని, వేధింపు చ‌ర్య‌ల‌ను జ‌నం గ‌మ‌నిస్తున్నార‌ని ఆరోపించారు నారా లోకేష్.

నారా చంద్ర‌బాబు నాయుడును జైలులో చంపేందుకు కుట్ర చేస్తున్నారంటూ సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేశారు. చంద్ర‌బాబు చ‌స్తాడంటూ వైసీపీ ఎంపీ గోరంట్ల మాధ‌వ్ బ‌హిరంగంగా ప్ర‌క‌టించ‌డం చూస్తుంటే ఇదే నిజం అయ్యేలా క‌నిపిస్తోందంటూ ఆవేద‌న వ్య‌క్తం చేశారు.

త‌న తండ్రి త‌న‌కు ప్రాణ భ‌యం ఉందంటూ , జైలులో చంపాల‌ని చూస్తున్నారంటూ ఏసీబీ కోర్టు జ‌డ్జికి లేఖ కూడా రాశార‌ని, ఇప్ప‌టి వ‌ర‌కు స్పందించిన దాఖ‌లాలు లేవ‌న్నారు నారా లోకేష్(Nara Lokesh). చంద్ర‌బాబు నాయుడు అవినీతికి పాల్ప‌డిన‌ట్లు ఒక్క ఆధార‌మైనా చూపించారా అంటూ ప్ర‌భుత్వాన్ని ప్ర‌శ్నించారు. ప్ర‌జ‌లంతా చంద్రబాబు కోసం క‌ళ్ల‌కు గంత‌లు క‌ట్టుకుని నిర‌స‌న తెలుపాల‌ని పిలుపునిచ్చారు.

Also Read : CM KCR : బీఆర్ఎస్ బాస్ సీరియ‌స్

Leave A Reply

Your Email Id will not be published!