CM KCR : బీఆర్ఎస్ బాస్ సీరియ‌స్

అస‌మ్మ‌తి నేత‌ల జంపింగ్ పై ఆరా

CM KCR : హైద‌రాబాద్ – గ‌తంలో ఎన్న‌డూ లేనంత‌గా బిగ్ ఫైట్ కొన‌సాగుతోంది ఈసారి తెలంగాణ‌లో జ‌రిగే ఎన్నిక‌లు. అన్ని పార్టీలు స‌ర్వ శ‌క్తులు ఒడ్డుతున్నాయి. ఎలాగైనా స‌రే ప‌వ‌ర్ లోకి రావాల‌ని ప్ర‌య‌త్నం చేస్తున్నాయి. ఇప్ప‌టికే అంద‌రి కంటే ముందంజ‌లో ఉన్నారు సీఎం కేసీఆర్.

CM KCR Serious Comments

మొత్తం రాష్ట్రంలో 119 నియోజ‌క‌వ‌ర్గాల‌కు గాను ఊహించ‌ని రీతిలో 115 మంది అభ్య‌ర్థుల‌ను ప్ర‌క‌టించారు. ఏకంగా ప్ర‌గ‌తి భ‌వ‌న్ లో ఎంపికైన వారంద‌రికీ బి ఫార‌మ్ లు కూడా ఇచ్చేశారు. ఇక ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షంగా ఉన్న కాంగ్రెస్ పార్టీ సైతం తొలి విడ‌త‌లో 55 మందికి, రెండ‌వ విడ‌త‌లో 45 మందికి సీట్ల‌ను కేటాయించింది. దీనిపై మ‌ల్ల గుల్లాలు ప‌డుతున్నాయి పార్టీలు.

ఇరు పార్టీల‌కు నేత‌ల వ‌ల‌స‌లు, అసంతృప్తుల బెడ‌ద తీవ్రంగా మారింది. ప్ర‌ధానంగా అధికారంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీకి చెందిన ఎమ్మెల్సీలు దామోద‌ర్ రెడ్డి, నారాయ‌ణ రెడ్డితో పాటు ఎమ్మెల్యే రేఖా నాయ‌క్ సైతం గుడ్ బై చెప్పారు. వారిని వెళ్ల‌కుండా నిలువ‌రించ‌డంలో పార్టీ నేత‌లు విఫ‌ల‌మ‌య్యారంటూ బీఆర్ఎస్ బాస్ కేసీఆర్(CM KCR) సీరియ‌స్ అయిన‌ట్లు స‌మాచారం.

ఈ మేర‌కు మంత్రుల‌కు క్లాస్ తీసుకున్న‌ట్లు జోరుగా ప్ర‌చారం జ‌రుగుతోంది. ఇదిలా ఉండ‌గా స‌ర్వేలు గంప గుత్త‌గా కాంగ్రెస్ పార్టీ ప‌వ‌ర్ లోకి వ‌స్తుంద‌ని ప్ర‌క‌టించాయి. ఇది కూడా ఓ కార‌ణ‌మై ఉండ‌వ‌చ్చ‌ని అంచ‌నా.

Also Read : Botsa Satyanarayana : భువ‌నేశ్వ‌రిపై భ‌గ్గుమ‌న్న బొత్స‌

Leave A Reply

Your Email Id will not be published!