Botsa Satyanarayana : భువ‌నేశ్వ‌రిపై భ‌గ్గుమ‌న్న బొత్స‌

ఎక్క‌డ నొప్పి క‌లిగిందో చెప్పాలి

Botsa Satyanarayana : ఆంధ్ర ప్ర‌దేశ్ – ఏపీ విద్యా శాఖ మంత్రి బొత్స స‌త్య‌నారాయ‌ణ(Botsa Satyanarayana) షాకింగ్ కామెంట్స్ చేశారు. ఏపీ స్కిల్ స్కాంలో అడ్డంగా బుక్కై రాజ‌మండ్రి సెంట్ర‌ల్ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న టీడీపీ చీఫ్ నారా చంద్ర‌బాబు నాయుడు ఇప్ప‌ట్లో బ‌య‌ట‌కు వ‌చ్చే ఛాన్స్ లేద‌న్నారు.

Botsa Satyanarayana Comments on Nara Bhuvaneswari

విచిత్రం ఏమిటంటే ఎవ‌రైనా న్యాయం కోసం ఆందోళ‌న చేప‌ట్ట‌డం చూశామ‌ని కానీ రూ. 371 కోట్లు బుక్కిన వ్య‌క్తి కోసం నిర‌స‌న‌లు, ధ‌ర్నాలు, ఆందోళ‌న‌లు, దీపాలు వెలిగించ‌డం చూడ‌లేద‌న్నారు బొత్స స‌త్య‌నారాయ‌ణ‌.

నారా భువ‌నేశ్వ‌రి ఏం మాట్లాడుతున్నారో , ఎందుకోసం బ‌స్సు యాత్ర చేస్తున్నారో త‌న‌కే తెలియ‌ని స్థితిలో ఉన్నారంటూ ఎద్దేవా చేశారు. చంద్ర‌బాబు రాజ‌కీయ జీవితం ముగిసి పోయింద‌న్నారు. ఆయ‌న ఆరి పోయే దిపంగా మారి పోయార‌ని, ఎవ‌రూ న‌మ్మే స్థితిలో లేర‌ని జోష్యం చెప్పారు బొత్స‌మ సత్య‌నారాయ‌ణ‌.

గ‌త 40 ఏళ్ల రాజ‌కీయ జీవితం అని చెప్పుకునే చంద్ర‌బాబు నాయుడు ఏపీకి చేసింది ఏమీ లేద‌న్నారు. ఉంటే చెప్పాల‌న్నారు. దేని కోసం టీడీపీని చూసి ఓట్లు వేస్తార‌ని , ప్ర‌జ‌లు ఎలా ఆద‌రిస్తారంటూ ప్ర‌శ్నించారు మంత్రి. ప్ర‌జ‌ల చెవుల్లో పూలు పెట్టాల‌ని ప్ర‌య‌త్నం చేస్తే చివ‌ర‌కు నిరాశ త‌ప్ప ఇంకేమీ మిగ‌ల‌ద‌న్నారు మంత్రి.

Also Read : Janasena BJP : జ‌న‌సేన‌..బీజేపీ పొత్తుపై ఫోక‌స్

Leave A Reply

Your Email Id will not be published!