Rahul Gandhi : బీసీ కుల గ‌ణ‌న‌పై మౌన‌మేల‌

వాయ‌నాడు ఎంపీ రాహుల్ గాంధీ

Rahul Gandhi : ఏఐసీసీ మాజీ చీఫ్, వాయ‌నాడు ఎంపీ రాహుల్ గాంధీ నిప్పులు చెరిగారు. ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోదీని , బీజేపీ సంకీర్ణ స‌ర్కార్ ను టార్గెట్ చేశారు. పీఎంకు రాహుల్ గాంధీ ప‌లు ప్ర‌శ్న‌లు సంధించారు. ఓబీసీ కుల గ‌ణ‌న అంటే మోదీ ఎందుకు భ‌య ప‌డుతున్నారంటూ ప్ర‌శ్నించారు. తీవ్ర స్థాయిలో నిప్పులు చెరిగారు.

Rahul Gandhi Slams PM Modi

ఇప్ప‌టికే ఓబీసీలు ఎంత మంది ఉన్నార‌నే దానిపై త‌మ స‌ర్కార్ ఇప్ప‌టికే డేటా పూర్తి చేసింద‌ని చెప్పారు. ఇవాళ రాహుల్ గాంధీ(Rahul Gandhi) మీడియాతో మాట్లాడారు. పూర్త‌యిన నివేదిక‌ను ఎందుకు బ‌య‌ట పెట్ట‌డం లేదంటూ నిప్పులు చెరిగారు.

ఇవాళ అన్ని రంగాల‌లో ఓబీసీలు రాణించాల్సిన అవ‌స‌రం ఉంద‌న్నారు. జ‌నాభాకు అనుగుణంగా వాటా ద‌క్క‌డం లేదంటూ ఆవేద‌న వ్య‌క్తం చేశారు. ఈ దేశంలో కావాల‌ని మోదీ ఓబీసీల‌ను ప‌క్క‌న పెడుతున్నారంటూ ఆరోపించారు రాహుల్ గాంధీ. ఈ నిజాన్ని ఓబీసీ యువ‌త నుంచి దాచి పెట్టాల‌ని బీజేపీ స‌ర్కార్ ప్ర‌య‌త్నం చేస్తోందంటూ ధ్వ‌జ‌మెత్తారు.

మోదీ కొలువు తీరాక అన్ని వ్య‌వ‌స్థ‌ల‌ను నిర్వీర్యం చేసిన ఘ‌న‌త ప్ర‌ధాన‌మంత్రికి ద‌క్కుతుంద‌న్నారు. బీజేపీ పాల‌న‌లో వ్యాపారులు, కార్పొరేట్ కంపెనీలు మాత్ర‌మే లాభ ప‌డ్డాయ‌ని ఆరోపించారు. సామాన్యులు, మ‌ధ్య‌త‌ర‌గ‌తి ప్ర‌జ‌ల‌కు ఇక్క‌ట్లు త‌ప్ప ఇంకేమీ లేవ‌న్నారు.

Also Read : Nara Lokesh : బాబును చంపేందుకు కుట్ర‌

Leave A Reply

Your Email Id will not be published!