Narges Mohammadi : హక్కుల కార్యకర్తకు గౌరవం
నర్గేస్ మొహమ్మదీకి నోబెల్ ప్రైజ్
Narges Mohammadi : ఇరాన్ లో మహిళల అణచివేతకు వ్యతిరేకంగా పోరాడినందుకు , మానవ హక్కులు, స్వేచ్ఛను ప్రోత్సహించినందుకు నార్గేస్ మొహమ్మదీకి 2023 సంవత్సరానికి గాను నోబెల్ శాంతి బహుమతి దక్కింది. ఈ మేరకు నార్వేజియన్ నోబెల్ కమిటీ నిర్ణయించింది.
Narges Mohammadi Got Appreciations
ఇరాన్ లో మహిళా హక్కుల న్యాయవాదిగా గుర్తింపు పొందారు నర్గేస్ మొహమ్మదీ(Narges Mohammadi). సుదీర్ఘమైన పోరాటం చేసింది. టెహ్రాన్ లోని ఎవిన్ జైలులో శిక్ష అనుభవించారు. ఇస్లామిక్ రిపబ్లిక్ మహిళల దుస్తుల కోడ్ ను ఉల్లంఘించినందుకు నైతికత పోలీసుల కస్టడీలో మహ్సా అమిని మరణించింది.
ఆ తర్వాత ఇరాన్ లో , ప్రపంచ వ్యాప్తంగా ఉన్న మహిళలు ఇరాన్ లో మహిళల పట్ల వ్యవహరిస్తున్న తీరును నిరసిస్తూనే ఉన్నందునే ఈ అవార్డు వచ్చింది. ఇరాన్ లో 1979లో విప్లవం వచ్చిన తర్వాత ఖొమేనీ నేతృత్వంలోని ఇస్లామిక్ మత పెద్దలు పట్టు సాధించారు.
మహిళలపై ప్రత్యేకంగా నిర్దేశించిన అణచివేత చట్టాల తెప్పను ప్రవేశ పెట్టింది. కానీ పాలన వారిపై హింసకు గురి చేసినప్పటికీ ఇరాన్ లో అణచివేతకు వ్యతిరేకంగా మహిళలు ముందు వరుసలో ఉన్నారు.
నర్గేస్ మొహమ్మదీ 1990లో విద్యార్థిగా ఉన్న సమయంలో పోరాడింది. ఇంజనీరింగ్ చేసింది. హక్కుల కోసం రచయిత్రిగా మారింది. 1998లో అరెస్ట్ అయ్యింది. హ్యూమన్ రైట్స్ సంస్థలో పని చేసింది.
Also Read : Ramya Krishnan : రోజాకు రమ్యకృష్ణ మద్దతు