NDA Manifesto: ‘ప్రజా మేనిఫెస్టో’ లో సామాన్యులకు భాగస్వామ్యం కల్పిస్తున్న కూటమి !
‘ప్రజా మేనిఫెస్టో’ లో సామాన్యులకు భాగస్వామ్యం కల్పిస్తున్న కూటమి !
NDA Manifesto: రానున్న సార్వత్రిక ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా ఏపీలోని టీడీపీ, జనసేన, బీజేపీ(BJP) కూటమి పావులు కదుపుతోంది. ఈ నేపథ్యంలో ప్రజల యొక్క అవసరాలు, ఆకాంక్షలను తెలుసుకుని వాటిని తమ మేనిఫెస్టోలో పెట్టడానికి ప్రజల నుండి అభిప్రాయాలను సేకరిస్తోంది. దీనిలో భాగంగా టీడీపీ, జనసేన, బీజేపీల కూటమి సంయుక్తంగా విడుదల చేయనున్న ‘ప్రజా మేనిఫెస్టో’ రూపకల్పనలో ప్రజలను కూడా భాగం చేస్తోంది. మేనిఫెస్టోలో రూపొందించే అంశాలపై సలహాలను, సూచనలను స్వీకరించేందుకు సిద్ధమైంది. ఈ మేరకు 8341130393 నంబర్ కు సూచనలను టెక్ట్స్ రూపంలో గానీ, వాయిస్ మెసేజ్, పీడీఎఫ్గానైనా పంపొచ్చని కూటమి నేతలు ఓ ప్రకటన విడుదల చేశారు. ఏపీలో ప్రజల ఆకాంక్షలు నెరవేర్చడమే ఎన్డీయే కూటమి అజెండా అని వారు ఈ ప్రకటనలో తెలిపారు.
NDA Manifesto Viral
2019 ఎన్నికల్లో ప్రకటించిన మేనిఫెస్టోను ఓ భగవద్గీత, బైబిల్, ఖురాన్ లా భావించి 99 శాతంపైగా హామీలను నెరవేర్చామని ఏపీలో అధికార వైసీపీ పెద్ద ఎత్తున ప్రచారం చేస్తుంది. మరోవైపు దానికంటే ధీటుగా 2024 ఎన్నికల మేనిఫెస్ట్ ను రూపొందిస్తున్నట్లు పార్టీ వర్గాలు చర్చించుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో వైసీపీ మేనిఫెస్టోకు ధీటుగా కూటమి మేనిఫెస్టోను రూపొందించడానికి తీవ్ర కసరత్తు చేస్తుంది. దీనిలో భాగంగా ప్రజల ఆకాంక్షలు, అవసరాలకు అనుగుణంగా ‘ప్రజా మేనిఫెస్టో’ రూపకల్పనలో ప్రజలను భాగస్వామ్యం చేసే విధంగా ప్రత్యేకంగా వినతులు స్వీకరిస్తోంది.
Also Read : Hyderabad Metro Rail: ఉగాది వేళ మెట్రో ప్రయాణికులకు గుడ్ న్యూస్ !