Nikhat Zareen : మెరిసిన నిఖత్ జరీన్ మురిసిన తెలంగాణ
కామన్వెల్త్ గేమ్స్ 2022లో బంగారు పతకం
Nikhat Zareen : బ్రిటన్ లోని బర్మింగ్ హోమ్ వేదికగా జరుగుతున్న కామన్వెల్త్ గేమ్స్ 2022 లో భారత్ పతకాల వేట కొనసాగిస్తోంది. తెలంగాణ రాష్ట్రానికి చెందిన బాక్సర్ నిఖత్ జరీన్(Nikhat Zareen) బంగారు పతకాన్ని సాధించింది.
చరిత్ర సృష్టించింది. ఆమె సాధించిన పసిడితో భారత్ కు ఇవాళ 10వ రోజు మూడు స్వర్ణాలు దక్కాయి. ఇక పురుషుల ట్రిపుల్ జంప్ లో ఎల్డోస్ పాల్ బంగారు పతకాన్ని సాధించాడు.
అబ్దుల్లా అబూబకర్ రజతం గెల్చుకున్నాడు. మహిళల జావెలిన్ త్రోలో అన్నూరాఆణి , పురుషుల 10 కిలో మీటర్ల రేస్ వాక్ లో సందీప్ కుమార్ లు వరుసగా భారత్ కు కాంస్య పతకాలను అందించారు.
మరో వైపు బ్యాడ్మింటన్ పురుషుల సింగ్స్ లో భారత్ షట్లర్ లక్ష్య సేన్ ఫైనల్ లోకి ప్రవేశించాడు. ఇక మరో ఆటగాడు కిలాంబి శ్రీకాంత్ ఓటమి పొందాడు.
అంతకు ముందు బాక్సర్లు అమిత్ పంఘల్ , నీతూ గంగాస్ వరుసగా పురుషుల ఫ్లై వెయిట్ , మహిళల మినిమమ్ వెయిట్ విభాగాలలో భారత్ కు బంగారు పతకాలను అందించారు.
అదే సమయంలో పీవీ సింధు తన సెమీ ఫైనల్ లో వరుస గేమ్ లలో గెలిచి మహిళల సింగిల్స్ ఫైనల్ కి చేరింది. ఇక మహిళల హాకీలో భారత్ షూటౌట్ లో న్యూజిలాండ్ ను ఓడించి కాంస్య పతకం సాధించింది.
మరో వైపు ట్రీసా జాలీ, గాయత్రి గోపీచంద్ బ్యాడ్మింటన్ మహిళల డబుల్స్ సెమీస్ లో ఓడి పోయి కాంస్య పతకం కోసం ఆడనున్నారు. ఇక భారత్ కు చెందిన సాత్విక్ సాయి రాజ్ రంకి రెడ్డి, చిరాగ్ శెట్టి బ్యాడ్మింటన్ పురుషుల డబుల్స్ ఫైనల్ లోకి ప్రవేశించారు. ఇవాళ స్వర్ణం కోసం ఆడనున్నారు.
Also Read : ఆర్యా వాల్వేకర్ మిస్ ఇండియా యుఎస్ విజేత