PM Modi : ప్రతిపక్షాల విమర్శలు సిలబస్ లో లేవు
విద్యార్థి ప్రశ్నకు ప్రధాని మోడీ జవాబు
PM Modi : ప్రతిపక్షాల విమర్శలు తన నాయకత్వ ప్రస్థానంలో చోటు లేదని స్పష్టం చేశారు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ. పరీక్షా పే చర్చా పేరుతో ఢిల్లీలో వేలాది మంది విద్యార్థులతో జరిగిన కార్యక్రమంలో మోడీ(PM Modi) ప్రసంగించారు. విద్యార్థులు అడిగిన పలు ప్రశ్నలకు ఆసక్తికరమైన రీతిలో జవాబులు ఇచ్చారు.
ఈ సందర్భంగా ఓ విద్యార్థి షాకింగ్ కు గురయ్యేలా ప్రశ్నించారు. దానికి చాలా కూల్ గా నవ్వుతూ జవాబు ఇచ్చారు నరేంద్ర మోడీ. ప్రజాస్వామ్యంలో విమర్శ అనేది శుద్ది వంటిదని పేర్కొన్నారు. అయితే ఆ విమర్శలు తన సిలబస్ లో లేవని పేర్కొన్నారు మోడీ. విమర్శలు లేక పోతే ప్రజాస్వామ్యానికి అర్థమే లేదన్నారు ప్రధానమంత్రి.
శుక్రవారం లక్ష మంది విద్యార్థులతో సంభాషించారు. బోర్డు పరీక్షలకు ముందు విద్యార్థులతో పరీక్షా పే చర్చా పేరు నిర్వహిస్తూ వస్తున్నారు నరేంద్ర మోడీ. ఇది వరుసగా ఇలా నిర్వహించడం ఆరవ సారి కావడం విశేషం. విద్యార్థులు అడిగే పలు ప్రశ్నలకు సమాధానాలు ఇస్తూ వస్తున్నారు ప్రధానమంత్రి.
ప్రతిరోజూ తాను పరీక్షను ఎదుర్కొంటానని కానీ ఏనాడూ ఒత్తిడికి లోను కానని చెప్పారు. అనవసరమైన ఒత్తిడి వల్ల ఇబ్బందులు ఏర్పడతాయని పేర్కొన్నారు. చదువు విషయంలో పిల్లలపై పేరెంట్స్ ఒత్తిళ్లు తీసుకు రావద్దని కోరారు నరేంద్ర మోడీ(PM Modi). మీరు కష్టపడి పని చేసే వారు, నిజాయతీపరులు అయితే విమర్శలను పట్టించు కోవద్దని , అవి మీకు బలం అవుతాయని అన్నారు.
ఆలోచించండి..విశ్లేషించండి..పని చేయండి..ఆపై మీరు కోరుకున్నది సాధించేందుకు మీ వంతు కృషి చేయండి అని పిలుపునిచ్చారు ప్రధానమంత్రి.
Also Read : పరీక్ష సహజం ఒత్తిడికి దూరం – మోడీ