PM Modi : చిరు ధాన్యాలపై ప్రచారం చేయండి
ఎంపీలకు ప్రధానమంత్రి మోదీ ఉద్భోధ
PM Modi : దైనందిన జీవితంలో చిరు ధాన్యాలు ఎంతో ముఖ్యమైనవని అన్నారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ(PM Modi) . వాటి గురించి ప్రతి ఒక్కరు ప్రజలకు అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందన్నారు. ఇందుకు సంబంధించి భారతీయ జనతా పార్టీకి చెందిన ప్రజా ప్రతినిధులు, ఎంపీలు విధిగా చిరు ధాన్యాల పట్ల అవగాహన కలిగి ఉండాలన్నారు.
అంతే కాకుండా రాబోయే సంవత్సరం 2023ని మిల్లెట్ల (చిరు ధాన్యాల ) సంవత్సరంగా గుర్తించే కార్య్రక్రమంలో పాల్గొనాలని నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. చిరు ధాన్యాల వినియోగాన్ని ప్రాచుర్యంలోకి తీసుకు రావడం, దాని ఆరోగ్య ప్రయోజనాల గురించి చెప్పాలని సూచించారు. రైతులకు కూడా ఇది ఎంత వరకు లాభంగా ఉంటుందో కూడా తెలియ చేయాలన్నారు.
వీలైతే ఎంపీలు చిరు ధాన్యాల పట్ల అవగాహన పెంచు కోవాలని స్పష్టం చేశారు ప్రధానమంత్రి. ఢిల్లీలో జరిగిన పార్టీ సమావేశంలో కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ సమావేశానికి కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ , బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా హాజరయ్యారు. నూతన సంవత్సరాన్ని చిరు ధాన్యాల సంవత్సరంగా గుర్తించాలని కోరారు.
పార్లమెంటరీ పార్టీ సమావేశంలో చిరు ధాన్యాల ప్రాధాన్యత గురించే ఎక్కువగా నరేంద్ర మోదీ(PM Modi) ప్రస్తావించడం విశేషం. మరో వైపు తాము పండించిన ధాన్యానికి మద్దతు ధర ఇవ్వాలని రైతులు ఆందోళన చేపట్టారు. బీజేపీకి చెందిన అనుబంధ సంస్థ భారతీయ కిసాన్ సంస్థ ఆధ్వర్యంలో కిసాన్ గర్జన ర్యాలీ నిర్వహించడం విశేషం.
చిరు ధాన్యాల వినియోగం వల్ల ఆరోగ్యం మెరుగు పడుతుందన్నారు ప్రధాని.
Also Read : కాంగ్రెస్ కు షాక్ ఎమ్మెల్యేలు గుడ్ బై