స్థిరమైన ప్రభుత్వంతోనే పేదరికం నిర్మూలన : నారా లోకేష్‌

2047 నాటికి 2.4 ట్రిలియన్ డాలర్ ఆర్థిక వ్యవస్థగా ఏపీ

న్యూఢిల్లీ : స్థిరమైన ప్రభుత్వంతోనే పేదరిక నిర్మూలన జరుగుతుందని, అగ్రికల్చర్ నుంచి మ్యానుఫ్యాక్చరింగ్ వరకు స్పీడ్ ఏపీ కల్చర్ గా మారిందని అన్నారు విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు. న్యూఢిల్లీలో పబ్లిక్ అఫైర్స్ ఫోరం ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో ‘సర్ణాంధ్ర@2047’ అంశంపై నిర్వహించిన ‘ఫైర్‌సైడ్ చాట్’ కార్యక్రమంలో మంత్రి నారా లోకేష్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి సమన్వయకర్తగా వివో మొబైల్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ ప్రెసిడెంట్ అర్జిత్ సేన్ వ్యవహరించారు. ఈ సందర్భంగా అడిగిన పలు ప్రశ్నలకు సమాధానం ఇచ్చారు. మంత్రి మాట్లాడుతూ.. ప్రతి రాజకీయ పార్టీకి ఓ కల్చర్ ఉంటుందన్నారు. ప్రభుత్వాలకు కూడా ఉంటుందని పేర్కొన్నారు. ఆ కల్చర్ నాయకత్వం నుంచి వస్తుంది. స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ఏపీ కల్చర్. ఆ వేగాన్ని మేం ఇప్పుడు క్షేత్రస్థాయి వరకు తీసుకెళ్లాం అన్నారు నారా లోకేష్‌. ప్రతి ఒక్కరూ వేగాన్ని ఎలా అందుకోవాలని ఆలోచిస్తున్నారని తెలిపారు. మంత్రివర్గ సమావేశంలో కూడా ఫైళ్లను ఎంత వేగంగా పరిష్కరిస్తున్నారనే అంశంపై చర్చ జరుగుతుందని పేర్కొన్నారు. దీనిపై మంత్రులకు ర్యాంకులు కూడా ఇవ్వడం జరుగుతుందని, అదే విధానం బ్యూరోక్రసీ స్థాయిలో కూడా ఉంటుందన్నారు.

పెట్టుబడులను ఆకర్షణలో స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ఏపీ ప్రత్యేకత అని చెప్పారు నారా లోకేష్‌. పొరుగు రాష్ట్రాల్లో దశాబ్దానికి పైగా నిలిచి పోయిన ప్రాజెక్టులను ఏపీలో 18 నెలల్లోపే ప్రారంభించ గలిగాం అన్నారు. 13 నెలల్లోనే విశాఖకు గూగుల్ డేటా సెంటర్ ను తీసుకు వచ్చాం. విధానాల విషయంలో కూడా ఇదే వేగం అవసరం అని నొక్కి చెప్పారు. టెక్నాలజీ చాలా వేగంగా మారుతోంద‌ని, వేగవంతమైన పురోగతి జరుగుతోందని తెలిపారు. సాధారణంగా విధానాలు టెక్నాలజీ కంటే ఒక అడుగు వెనుకే ఉంటాయ‌ని పేర్కొన్నారు నారా లోకేష్‌. విధానాలు కూడా తమను తాము మార్చుకునేందుకు మంత్రుల పాత్ర, బ్యూరోక్రాట్ల పాత్ర కీలకమవుతుందని అన్నారు . పౌరులకు వేగంగా సేవలందించేందుకు ‘మనమిత్ర’ వాట్సాప్ గవర్నెన్స్ ను తీసుకు వచ్చాం అన్నారు నారా లోకేష్‌. దాదాపు వెయ్యి పౌర సేవలను వాట్సాప్ ద్వారా అందిస్తున్నామ‌ని, టెక్నాలజీని విస్తృతంగా ఎలా ఉపయోగిస్తున్నామో చెప్పడానికి ఇదో ఒక గొప్ప ఉదాహరణ అని చెప్పారు. అందువల్ల స్పీడ్ ఇప్పుడు ఏపీ ప్రభుత్వ సంస్కృతిగా మారిందన్నారు. ఇది వ్యవసాయం నుంచి తయారీ రంగం వరకు, పాలన నుంచి ఐటీ వరకు అన్ని రంగాల్లో మార్పును తీసుకొస్తోందన్నారు. సీఎం చంద్రబాబు నేతృత్వంలో మేం తీసుకొచ్చిన ప్రధాన సాంస్కృతిక మార్పు ఇదేన‌ని స్ప‌ష్టం చేశారు.

Leave A Reply

Your Email Id will not be published!