Rahul Gandhi : రాహుల్ గాంధీ మాస్ లీడర్
జూన్ 19 పుట్టిన రోజు
Rahul Gandhi : ఏఐసీసీ మాజీ చీఫ్ రాహుల్ గాంధీ పుట్టిన రోజు ఇవాళ. వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు శుభాకాంక్షలు తెలిపారు. చాలా మంది ఆయనను తప్పుగా అర్థం చేసుకున్నారు. ప్రత్యేకించి భారతీయ జనతా పార్టీ రాహుల్ గాంధీ వ్యక్తిత్వాన్ని కించ పరిచే ప్రయత్నం చేసింది. కానీ ఎక్కడా తగ్గలేదు. తనను తాను ప్రూవ్ చేసుకునేందుకు ప్రయత్నం చేస్తూ వచ్చారు. ఇందులో సక్సెస్ అయ్యారు. ఆయనను సోషల్ మీడియా వేదికగా పప్పు అంటూ ట్రోల్ చేశారు.
దేశం గర్వించ దగిన రీతిలో నాయకుడిగా ఎదిగారు. మొదట్లో కొంత తడబాటుకు గురైనా ఆ తర్వాత సర్దు కున్నారు. ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రధానంగా ఎత్తి చూపడంలో సక్సెస్ అయ్యారు. ఆపై నియంతృత్వ ధోరణితో పాలన సాగిస్తున్న ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని లక్ష్యంగా చేసుకున్నారు. ఒక రకంగా ఆయనను గత కొంత కాలం నుంచీ ఉక్కిరి బిక్కిరి చేస్తూ వచ్చారు. ఈ దేశంలో బడుగు, బలహీన, నిమ్న, అణగారిన వర్గాలకు అండగా తాను ఉన్నానంటూ ప్రకటించారు. వారికి భరోసా ఇచ్చారు.
ఈ దేశాన్ని ఎలా సంపన్న వర్గాలకు, బడా బాబులకు, వ్యాపారవేత్తలకు, కార్పొరేట్ కంపెనీలకు ప్రభుత్వరంగ సంస్థలను ఎలా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ధారదత్తం చేశారనే దానిపై నిత్యం నిలదీస్తూ వచ్చారు. అంతే కాదు కులం పేరుతో, మతం పేరుతో, విద్వేషాల పేరుతో ప్రజలను రెచ్చగొడుతున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆపై పార్లమెంట్ సాక్షిగా నిగ్గదీసి మోదీని నిలదీశారు. కాషాయ శ్రేణులను ఏకి పారేశారు. దేశాన్ని సర్వ నాశనం చేశారంటూ మండిపడ్డారు రాహుల్ గాంధీ(Rahul Gandhi).
ఇదే సమయంలో భారత్ జోడో యాత్ర చేపట్టారు. ఈ యాత్ర రాహుల్ గాంధీకి దేశంలో మరింత జనాదరణ కలిగేలా చేసింది. ప్రపంచ వ్యాప్తంగా రాహుల్(Rahul) ను అరుదైన నేతగా గుర్తింపు పొందేలా చేసింది. మెల మెల్లగా ప్రధాని మోదీ గ్రాఫ్ తగ్గుతోందని యువ నాయకుడికి పెరుగుతోందని సర్వేలు చెబుతున్నాయి. భావి ప్రధాని రేసులో ఉండడం ఆహ్వానించ దగిన పరిణామం.
Also Read : Tirumala : పోటెత్తిన భక్తులతో తిరుమల కిటకిట