YS Sharmila : రాహుల్ గాంధీకి ష‌ర్మిల విషెస్

యువ నాయ‌కుడికి అభినంద‌న‌లు

YS Sharmila : ఏఐసీసీ మాజీ చీఫ్‌, వాయ‌నాడు మాజీ ఎంపీ రాహుల్ గాంధీ పుట్టిన రోజు ఇవాళ‌. దేశ రాజ‌కీయాల‌లో త‌న‌కంటూ ఓ స్పెష‌ల్ ఇమేజ్ ను స్వంతం చేసుకున్న నాయ‌కుడు. భార‌త్ జోడో యాత్ర ద్వారా సంచ‌ల‌నం సృష్టించారు. ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోదీని ఏకి పారేస్తూ ప్ర‌జ‌ల త‌ర‌పున త‌న గొంతు ఇస్తున్నారు. ప్ర‌జా స‌మ‌స్య‌ల‌ను ప్ర‌స్తావిస్తూ హైలెట్ గా మారారు.

ఇదిలా ఉండ‌గా రాహుల్ గాంధీ బ‌ర్త్ డే సంద‌ర్బంగా శుభాకాంక్ష‌లు వెల్లువెత్తుతున్నాయి. క‌ర్ణాట‌క సీఎం సిద్ద‌రామ‌య్య‌, డిప్యూటీ సీఎం డీకే శివ‌కుమార్ , రాజ‌స్థాన్ సీఎం అశోక్ గెహ్లాట్, ఛ‌త్తీస్ గ‌ఢ్ సీఎం భూపేష్ బ‌ఘేల్, ఎన్సీపీ చీఫ్ శ‌ర‌ద్ ప‌వార్, శివ‌సేన పార్టీ చీఫ్ ఉద్ద‌వ్ ఠాక్రే , ఎంపీ సంజ‌య్ రౌత్ , టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, మాజీ పీసీసీ చీఫ్ న‌వ్ జ్యోత్ సింగ్ సిద్దూ తో పాటు ప‌లువురు రాహుల్ గాంధీకి అభినంద‌న‌లు తెలిపారు.

కాగా వైఎస్సార్ తెలంగాణ పార్టీ చీఫ్ వైఎస్ ష‌ర్మిల(YS Sharmila) ట్విట్ట‌ర్ వేదిక‌గా స్పందించారు. రాహుల్ గాంధీకి పుట్టిన‌రోజు శుభాకాంక్ష‌లు. ఇది చాలా సంతోష‌క‌ర‌మైన రోజు. మీరు మీ ప‌ట్టుద‌ల‌, స‌హ‌నంతో ప్ర‌జ‌ల‌కు స్పూర్తినిస్తూ హృద‌య పూర్వ‌క ప్ర‌య‌త్నాల ద్వారా సేవ చేస్తూ ఉండాల‌ని కోరారు. ఆరోగ్య‌వంతంగా, సుఖ సంతోషాల‌తో విల‌సిల్లాల‌ని పేర్కొన్నారు వైఎస్ ష‌ర్మిల‌.

Also Read : Rahul Gandhi : రాహుల్ గాంధీ మాస్ లీడర్

 

Leave A Reply

Your Email Id will not be published!