ముంబై : నితీశ్ తివారీ దర్శకత్వం వహించిన తాజా చిత్రం రామాయణం. ఇందులో కీలక పాత్రలు పోషించారు యశ్ రావణాసురుడిగా, రణబీర్ కపూర్ రాముడిగా, సాయి పల్లవి సీత పాత్రలు పోషించారు. రూ. 2000 కోట్లు ఖర్చు చేసి ఈ చిత్రాన్ని రూపొందించారు. విడుదలైన రోజు నుంచి నేటి దాకా భారీ ఆదరణ పొందుతోంది. తాజాగా ఈ సినిమా కలెక్షన్స్ కు సంబంధించి భారీ వసూళ్లతో రికార్డు నమోదు చేసింది. గతంలో హిందీ లో విడుదలై రికార్డు సృష్టించిన సినిమాలను తలదన్నేలా రామాయణం వసూళ్లు సాధించడం పట్ల చిత్ర నిర్మాతలు సంతోషం వ్యక్తం చేశారు. యష్, రణబీర్ కపూర్ నటించిన ‘రామాయణం’ బాక్సాఫీస్ వద్ద రూ. 375.50 కోట్లు వసూలు చేసింది. ఈ విషయాన్ని మూవీ మేకర్స్ అధికారికంగా సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు.
ఈ చిత్రం హిందీ, తమిళం, తెలుగు, కన్నడ, మలయాళ భాషల్లో నవంబర్ 5న థియేటర్లలో విడుదలైంది. ఇది ప్రాచీన ఇతిహాసం “రామాయణం” రెండు భాగాల చలనచిత్ర అనుసరణలో మొదటి భాగం. ట్రేడ్ ట్రాకింగ్ వెబ్‌సైట్ శాక్‌నిల్క్ ప్రకారం ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా బాక్సాఫీస్ వద్ద రూ. 375.50 కోట్లు వసూలు చేసింది. దేశీయ బాక్సాఫీస్ వద్ద ఈ చిత్రం స్థూలంగా రూ. 218.25 కోట్లు వసూలు చేసింది. ఇదిలా ఉండగా భారీ సెట్టింగ్స్ , సన్నివేశాలు ప్రతి ఒక్కరినీ సినిమాను చూసేందుకు ప్రేరేపించేలా చేశాయి. రాబోయే రోజుల్లో మరి కొంత కలెక్షన్స్ రానున్నట్లు అంచనా వేస్తున్నారు దర్శకుడు, నిర్మాతలు.