RK Roja Selvamani : కళాకారుల ప్రదర్శన అద్భుతం
ఏపీ మంత్రి ఆర్కే రోజా సెల్వమణి
RK Roja Selvamani : ఏపీ పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి ఆర్కే రోజా సెల్వమణి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తెలుగు సంస్కృతికి ఎనలేని చరిత్ర ఉందన్నారు. కూచిపూడి కళాకారులు ప్రదర్శించిన కళారూపాల గురించి ఎంత చెప్పినా తక్కువేనని పేర్కొన్నారు.
RK Roja Selvamani Praises Classical Dancers
కృష్ణా జిల్లా కూచిపూడి గ్రామంలోని శ్రీ సిద్దేంద్ర యోగి కళా క్షేత్రంలో పద్మ భూషణ్ అవార్డు గ్రహీత డాక్టర్ వేంపటి చిన సత్యం జయంతిని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్బంగా ఈ అరుదైన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు ఆర్కే రోజా సెల్వమణి.
అంతకు ముందు గ్రామంలోని శ్రీ రామలింగేశ్వర స్వామి దేవస్థానంలో కొలువు తీరిన శ్రీ రామలింగేశ్వర స్వామి, బాలా త్రిపుర సుందరి అమ్మ వారిని దర్శించుకున్నారు మంత్రి. అనంతరం పద్మ భూషణ్ వెంపటి చిన్న సత్యం పేరుతో ఏర్పాటు చేసిన కాంశ్య విగ్రహానికి ఆర్కే రోజా సెల్వమణి(RK Roja Selvamani) పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.
1000 మందికి పైగా కళాకారులు పాల్గొని ప్రదర్శించిన కళా రూపాలు ప్రతి ఒక్కరినీ ఆకట్టుకున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం కళాకారులకు, తెలుగు సంస్కృతి, సంప్రదాయాలకు పెద్ద పీట వేస్తుందని స్పష్టం చేశారు మంత్రి. ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి రాష్ట్ర అభివృద్దికి కృషి చేస్తున్నారని చెప్పారు.
Also Read : TTD Chairman Bhumana : వేదం జీవన నాదం – టీటీడీ చైర్మన్