Rohit Sharma : కెప్టెన్సీ తొల‌గింపు బాధాక‌రం

రోహిత్ శ‌ర్మ సీరియ‌స్ కామెంట్స్

Rohit Sharma : ముంబై – భార‌త క్రికెట్ జ‌ట్టు కెప్టెన్ గా ఉన్న రోహిత్ శ‌ర్మ‌కు కోలుకోలేని షాక్ త‌గిలింది. ఇండియ‌న్ ప్రిమీయ‌ర్ లీగ్ (ఐపీఎల్) లో అద్భుత విజ‌యాలు అందించాడు త‌న సార‌థ్యంలో ముంబై ఇండియ‌న్స్ కు. ఈ జ‌ట్టుకు యాజ‌మాన్యంగా ఉంది ముఖేష్ అంబానీ సార‌థ్యంలోని రిల‌య‌న్స్ గ్రూప్.

Rohit Sharma Comment

విచిత్రం ఏమిటంటే స‌డెన్ గా సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకుంది స‌ద‌రు యాజ‌మాన్యం. ఇప్ప‌టి వ‌ర‌కు ముంబై ఇండియ‌న్స్ కు స్కిప్ప‌ర్ గా ఎన్నో గెలుపులు, చిర‌స్మ‌ర‌ణీయ‌మైన విజయాలు అందించిన త‌న‌కు క‌నీసం మాట మాత్ర‌మైనా చెప్ప‌లేద‌ని వాపోయాడు రోహిత్ శ‌ర్మ‌(Rohit Sharma). క‌నీసం ఫోన్ కూడా చేయ‌లేద‌ని పేర్కొన్నాడు.

ఇదిలా ఉండ‌గా రోహిత్ శ‌ర్మ చేసిన కామెంట్స్ క‌ల‌క‌లం రేపుతున్నాయి. భార‌త జ‌ట్టుకు ప్రాతినిధ్యం వ‌హిస్తున్న ఆట‌గాడిగా ఆ మాత్రం అర్హుడిని కాకుండా ఎలా పోయానంటూ ఆవేద‌న వ్య‌క్తం చేశారు. త‌న సార‌థ్యంలో 5 ట్రోఫీల‌ను గెలుపొందిన విష‌యం మ‌రిచి పోతే ఎలా అని ప్ర‌శ్నించారు.

మ‌రో వైపు హార్దిక్ పాండ్యాను గుజ‌రాత్ టైటాన్స్ నుంచి తీసుకుంది ముంబై ఇండియ‌న్స్. ముంబైకి స్కిప్ప‌ర్ గా ఉన్న రోహిత్ శ‌ర్మ‌ను ప‌క్క‌న పెట్టేసింది. కోలుకోలేని షాక్ ఇచ్చింది రిల‌య‌న్స్ యాజమాన్యం. ప్ర‌స్తుతం స‌ద‌రు నిర్ణ‌యంపై క్రికెట్ ఫ్యాన్స్ ప్ర‌ధానంగా రోహిత్ అభిమానులు భ‌గ్గుమంటున్నారు.

Also Read : IND vs SA 1st ODI : అబ్బా భార‌త బౌల‌ర్ల దెబ్బ

Leave A Reply

Your Email Id will not be published!