Ruturaj Gaikwad : సిక్సర్లు ధనా ధన్ రుతురాజ్ సెన్సేషన్
ఒకే ఓవర్ లో ఏడు సిక్సర్ల మోత
Ruturaj Gaikwad : ఇదేమిటి ఒకే ఒక్క ఓవర్ లో ఏడు సిక్సర్లు ఏమిటి అనుకుంటున్నారా. అవును నిజమే. దీనిని సాధించింది ఎవరో కాదు భారత యవ బ్యాటర్ రుతురాజ్ గైక్వాడ్. మనోడు ఐపీఎల్ లో నమ్మకమైన ప్లేయర్ గా తనను తాను ప్రూవ్ చేసుకున్నాడు. దేశీవాళి ఆటలో భాగంగా విజయ్ హజారే ట్రోఫీ సందర్భంగా జరిగిన మ్యాచ్ లో దుమ్ము రేపాడు. ఆకాశమే హద్దుగా చెలరేగాడు.
ఏకంగా ఒకే ఓవర్ లో ఏడు సిక్సర్లు కొట్టి తనకు ఎదురే లేదని చాటాడు. ప్రస్తుతం రుతురాజ్ గైక్వాడ్(Ruturaj Gaikwad) నెట్టింట్లో వైరల్ గా మారాడు. ఒకే ఓవర్ లో ఆరు సిక్సర్లు కొట్టిన ఆటగాళ్లను చూశాం. కానీ అదే ఓవర్ లో ఏడు సిక్సర్లు సాధించి చరిత్ర సృష్టించాడు రుతురాజ్ గైక్వాడ్. ఇప్పటి వరకు వరల్డ్ క్రికెట్ లో ఎవరూ ఈ ఘనతను సాధించ లేదు.
ఒక్క రుతురాజ్ తప్ప. ఈ ఘనత ఉత్తర ప్రదేశ్ జట్టుతో జరిగిన క్వార్టర్ ఫైనల్ లో ఈ రికార్డు నమోదు చేశాడు. యూపీ స్పిన్నర్ శివ సింగ్ బౌలింగ్ లో మహారాష్ట్ర కెప్టెన్ గా ఉన్న గైక్వాడ్ దంచి కొట్టాడు. మొదటి ఐదు బంతుల్ని గ్రౌండ్ వెలుపలికి పంపించాడు. దీంతో 30 పరుగులు వచ్చాయి. రుతురాజ్ గైక్వాడ్ దెబ్బకు శివ సింగ్ బెంబేలెత్తి పోయాడు.
ఆపై ఆరో బంతిని నో బాల్ వేశాడు. అది ఫ్రీ హిట్ కూడా వచ్చింది. దానిని కూడా సిక్సర్ కొట్టాడు. ఆ తర్వాతి బంతిని కూడా సిక్స్ గా మలిచాడు. దీంతో మొత్తంగా ఒకే ఒక్క ఓవర్ లో ఏడు సిక్సర్లు వచ్చాయి. రుతురాజ్ గైక్వాడ్(Ruturaj Gaikwad) ఏకంగా డబుల్ సెంచరీ చేశాడు.
Also Read : భారత ఒలింపిక్ సంఘం అధ్యక్షురాలిగా పీటీ ఉష