Smita Sabharwal : అమ్మ స‌న్నిధిలో స్మితా

స‌రస్వ‌తి అమ్మ వారిగా అలంక‌ర‌ణ‌

Smita Sabharwal : హైద‌రాబాద్ – స్మితా సబ‌ర్వాల్ గురించి చెప్పాల్సిన ప‌ని లేదు. ఆమె సీనియ‌ర్ ఐఏఎస్ ఆఫీస‌ర్. ప్ర‌స్తుతం సీఎంఓ ఆఫీసులో విధులు నిర్వ‌హిస్తున్నారు. మిష‌న్ భగీర‌థ‌కు ఇంఛార్జ్ గా ఉన్నారు. ఆమె అత్యంత కీల‌క‌మైన ఆఫీస‌ర్ గా గుర్తింపు పొందారు. గ‌తంలో క‌లెక్ట‌ర్ గా విధులు నిర్వ‌హించిన స‌మ‌యంలో నిక్క‌చ్చిగా వ్య‌వ‌హ‌రించారు.

Smita Sabharwal Visited Temple

ప్ర‌జ‌ల‌కు సేవ చేయ‌డంలో ఎక్కువ‌గా ఉత్సుక‌త చూపించారు. ఆత‌ర్వాత అమ‌రుల త‌ల్లుల‌ను అక్కున చేర్చుకున్నారు. వారిని సాద‌రంగా ఆహ్వానించి గౌర‌వించారు. దీంతో దేశ వ్యాప్తంగా వైర‌ల్ అయ్యారు.

అతి పిన్న వ‌య‌సులో ఐఏఎస్ గా ఎంపికైన అధికారిణిగా గుర్తింపు తెచ్చుకున్నారు స్మితా స‌బ‌ర్వాల్(Smita Sabharwal). ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో ట్రెండింగ్ లో కొన‌సాగుతున్నారు. త‌ను డిఫ‌రెంట్ యాంగిల్స్ లో ఫోటోలు షేర్ చేస్తున్నారు. ఆ మ‌ధ్య‌న గోవాకు వెళ్లిన ఫోటోస్ సెన్సేష‌న్ క్రియేట్ చేశాయి.

తాజాగా న‌వ‌రాత్రి ఉత్స‌వాల‌ను పుర‌స్క‌రించుకుని త‌న నివాసంలో ఏర్పాటు చేసిన అమ్మ వారిని స‌రస్వ‌తి దేవిగా అలంక‌రించి పూజ‌లు చేప‌ట్టారు. ఇందుకు సంబంధించిన ఫోటోస్ ట్విట్ట‌ర్ వేదిక‌గా షేర్ చేశారు. ఇప్పుడు వైర‌ల్ అవుతున్నాయి. ఎంతైనా స్మ‌తా స‌బర్వాల్ అంటే మామూలు ఆఫీస‌ర్ కాదు క‌దా. ఏది చేసినా అది హాట్ టాపిక్ కావ‌డం ఖాయం.

Also Read : Congress 2nd List : కాంగ్రెస్ రెండో లిస్టు డిక్లేర్

Leave A Reply

Your Email Id will not be published!