#SatishDhawan : అంతరిక్ష వాస్తుశిల్పి సతీష్ ధావన్

Space Architect Satish Dhawan

Satish Dhawan : భారత దేశం గర్వించదగిన అంతరిక్ష శాస్త్రవేత్త సతీష్ ధావన్. ఆయన్ను భారత ఎక్స్పెరిమెంటల్ ఫ్లూయిడ్ డైనమిక్స్ ప్రయోగాత్మక (ద్రవ డైనమిక్స్ పరిశోధన) కు పితామహుడిగా పరిగణిస్తారు.అల్లకల్లోలం మరియు సరిహద్దు పొరల రంగంలో అత్యంత ప్రసిద్ధ పరిశోధకులలో అగ్రగణ్యుడు గా భావిస్తారు. గణితం, ఏరోస్పేస్ ఇంజనీరింగుల్లో డబల్ పి.హెచ్.డి సాధించి, ధావన్ గ్రామీణ విద్యలోను, రిమోట్ సెన్సింగు, ఉపగ్రహ సమాచారాల లోను పరిశోధనలు చేసాడు. వాటి ఫలితంగానే ఇన్‌శాట్, ఐఆర్ఎస్, పిఎస్ఎల్‌విలు రూపొందాయి.

స్పేస్ కమిషను ఛైర్మనుగా, ఇస్రో ఛైర్మనుగా భారత ప్రభుత్వ అంతరిక్ష శాఖలో సెక్రెటరీగా బాధ్యతలు స్వీకరించాడు. భారతదేశపు మొట్టమొదటి సూపర్‌సోనిక్ విండ్ టన్నెల్‌ను నిర్మించాడు. భారత దేశపు అత్యున్నత పురస్కారాలు పద్మ విభూషణ్, పద్మ భూషణ్, పొందాడు. విశిష్ట పూర్వ విద్యార్ధి పురస్కారం, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్. విశిష్ట పూర్వ విద్యార్ధి కాలిఫోర్నియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, 1969 అవార్డు పొందాడు.

సతీష్ ధావన్ (1920 సెప్టెంబరు 25 – 2002 జనవరి 3) శ్రీనగర్ లో జన్మించిన ధావన్, భారతదేశం, అమెరికాలో తన విద్యాభ్యాసాన్ని పూర్తి చేసాడు. టర్బులెన్స్, బౌండరీ లేయర్స్ రంగాల్లో ఆయనను అత్యున్నత స్థాయి పరిశోధకుల్లో ఒకరిగా పరిగణిస్తారు. ఆయా రంగాల్లో ఆయన శక్తి సామర్థ్యాలు భారత స్వదేశీ అంతరిక్ష కార్యక్రమ అభివృద్ధికి దోహదపడింది. 1972 లో ఎమ్.జి.కె. మీనన్ తరువాత, ఇస్రో ఛైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించాడు. ప్రొఫెసర్ సతీష్ ధావన్ సమాజాన్ని మార్చే మార్గంగా టెక్నాలజీని, ముఖ్యంగా హై టెక్నాలజీని చూసిన మానవతావాది. భారతదేశం యొక్క అత్యంత విజయవంతమైన అంతరిక్ష కార్యక్రమానికి వాస్తుశిల్పి సతీష్ ధావన్.

ప్రస్తుతం పాకిస్తాన్‌లో ఉన్న లాహోరు లోని యూనివర్సిటీ ఆఫ్ పంజాబ్ నుండి బాచిలర్ ఆఫ్ సైన్స్ డిగ్రీ, మెకానికల్ ఇంజనీరింగ్ డిగ్రీ, ఇంగ్లీషు సాహిత్యంలో ఎమ్.ఏ డిగ్రీ పొందాడు. 1947 లో మిన్నియా పోలిస్ లోని యూనివర్సిటీ ఆఫ్ మిన్నెసోటా నుండి ఏరోస్పేస్ ఇంజనీరింగులో ఎమ్.ఎస్., కాలిఫోర్నియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ నుండి ఏరోనాటికల్ ఇంజనీరింగులో డిగ్రీ, ఆ తరువాత 1951 లో డా. హాన్స్ డబ్ల్యు లేప్‌మ్యాన్ మార్గదర్శకుడిగా గణితం, ఏరోస్పేస్ ఇంజనీరింగుల్లో డబుల్ పి.హెచ్.డి పొందాడు.

డా. ధావన్ స్పేస్ కమిషను ఛైర్మనుగా, ఇస్రో ఛైర్మనుగా (1972–1984) భారత ప్రభుత్వ అంతరిక్ష శాఖలో సెక్రెటరీగా పని చేశాడు. స్పేస్ కమిషన్ ఛైర్మన్ గా బాధ్యతలు తీసుకోగానే అణుశక్తి కమిషనులో ఉన్న బ్రహ్మ ప్రకాష్‌ను తిరువనంతపురంలో ఉన్న విక్రం సారాభాయ్ అంతరిక్ష కేంద్రానికి ఛైర్మనుగా నియమించాడు. ఇస్రో శీఘ్రగతిన ఎదగడానికి ఆయన తీసుకున్న నిర్ణయం ఎంతో తోడ్పడింది. ఆ తరువాత భారత తొలి ఉపగ్రహ వాహక నౌక ఎస్ఎల్‌వి అభివృద్ధి కార్యక్రమానికి అబ్దుల్ కలాంను నాయకుడిగా నియమించాడు.

1975 లో ఎ.పి.జె. అబ్దుల్ కలామ్ నాయకత్వంలో ఎస్ఎల్‌వి అభివృద్ధి జరుగగా, దాని మొదటి ప్రయోగం విఫలమైంది. వైఫల్యానికి బాధ్యత వహిస్తూ ఆనాటి పత్రికా సమావేశంలో పాల్గొని ఆ వైఫల్యాన్ని తానే స్వీకరించాడు. రెండవ ప్రయోగం విజయవంత మైనపుడు ఆనాటి పత్రికా సమావేశాన్ని అబ్దుల్ కలాం చేత చేయించాడు.

1951 లో ధావన్ భారత్ శాస్త్ర విజ్ఞాన సంస్థలో ఉపాధ్యాయుడిగా చేరాడు. 1962 దానికి డైరెక్టరుగా నియమితుడై, 1962–1981 వరకు ఐఐఎస్‌సి చైర్మన్ గా పని చేశాడు. ఆయన ఇస్రో ఛైర్మనుగా ఉన్నప్పటికీ, బౌండరీ లేయర్ పరిశోధనలో తన శక్తియుక్తులు నియోగించాడు. ఆయన చేసిన పరిశోధనలను హెర్మన్ ష్లిక్టింగ్, తాను రాసిన బౌండరీ లేయర్ థియరీ పుస్తకంలో వివరించాడు. ధావన్ ఐఐఎస్‌సి లో భారతదేశపు మొట్టమొదటి సూపర్‌సోనిక్ విండ్ టన్నెల్‌ను నిర్మించాడు. అయన గ్రామీణ విద్య, రిమోట్ సెన్సింగ్ మరియు ఉపగ్రహ సమాచార మార్పిడిలో మార్గదర్శక ప్రయోగాలు చేశారు. ధావన్ ప్రయత్నాలు INSAT- ఒక టెలికమ్యూనికేషన్ ఉపగ్రహం, IRS – ఇండియన్ రిమోట్ సెన్సింగ్ ఉపగ్రహం మరియు పోలార్ శాటిలైట్ లాంచ్ వెహికల్ (PSLV) వంటి కార్యాచరణ వ్యవస్థలకు దారితీశాయి, ఇవి భారతదేశాన్ని అంతరిక్ష వ్యవసాయ దేశాల లీగ్‌లో ఉంచాయి.

2002 లో ధావన్ మరణించాక, నెల్లూరు జిల్లా శ్రీహరికోట లోని అంతరిక్ష ప్రయోగ కేంద్రానికి ఆయన పేరుతో “సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం”గా పేరు పెట్టారు. లూఢియానా లోని ప్రభుత్వ కళాశాలను ఆయన పేరిట మార్చారు.

పద్మ విభూషణ్, 1981, పద్మ భూషణ్, 1971, ఇందిరా గాంధీ జాతీయ సమైక్యతా పురస్కారం, 1999 స్వీకరించాడు. ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్, బెంగళూరు సీనియర్ సైంటిఫిక్ ఆఫీసరు, 1951; ప్రొఫెసర్ అండ్ హెడ్ అఫ్ డిపార్ట్‌మెంట్ ఆఫ్ ఏరొనాటికల్ ఇంజనీరింగ్, 1955; డైరెక్టరు, 1962–1981;
కాలిఫోర్నియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, అమెరికా విజిటింగ్ ప్రొఫెసరు, 1971–72; నేషనల్ ఏరోస్పేస్ లాబరేటరీస్, బెంగళూరు రీసెర్చి కౌన్సిల్ ఛైర్మను, 1984–93; ఇండియన్ అకాడెమీ ఆఫ్ సైన్సెస్ప్రె ప్రెసిడెంట్, 1977–1979; ఇస్రో ఛైర్మన్, 1972–1984; ఇండియన్ స్పేస్ కమిషను ఛైర్మన్, 1972–2002 గా విధులు నిర్వర్తించాడు. 2002 జనవరి 3న 81ఏళ్ళ వయసులో మరణించాడు.

No comment allowed please