Alishetty Prabhakar : అలిశెట్టి కుటుంబానికి ఆసరా
డబుల్ బెడ్ రూమ్ కేటాయింపు
Alishetty Prabhakar : తెలంగాణ – ప్రముఖ తెలంగాణ కవి, దివంగత అలిశెట్టి ప్రభాకర్ కుటుంబానికి తీపి కబురు చెప్పింది రాష్ట్ర ప్రభుత్వం. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు అలిశెట్టి ఫ్యామిలీకి డబుల్ బెడ్ రూమ్ కేటాయించారు. ఈ విషయాన్ని స్వయంగా మంత్రి కేటీఆర్ వెల్లడించారు.
తన జీవితాంతం ప్రజల కోసం కవిత్వం రాశాడు. నిర్భాగ్యుల, అన్నార్తుల గొంతుకుగా మలిచిన ప్రజా కవి అలిశెట్టి. ప్రత్యేకించి అలిశెట్టి ప్రభాకర్ కు తెలంగాణ శ్రీశ్రీ అన్న పేరు కూడా ఉంది. హైదరాబాద్ లో డబుల్ బెడ్ రూమ్ కేటాయిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
Alishetty Prabhakar Family Got Double Bedroom House
ఆనాటి ఉమ్మడి కరీంనగర్ జిల్లా జగిత్యాల స్వస్థలం అలిశెట్టి ప్రభాకర్(Alishetty Prabhakar). చిత్రకారుడిగా, ఫోటోగ్రాఫర్ గా , అభ్యుదయ, విప్లవ కవిగా వినుతికెక్కాడు. తన జీవితాంతం ప్రజల కోసం కవిత్వం రాశాడు. మనసున్న ప్రతి మనిషిని కదిలించేలా చేశాడు తన అజరామర కవిత్వంతో.
దారి తప్పిన సామాజిక పోకడల గురించి పదునైన పదాలలో బంధించాడు. పేదరికం , మహిళా సమస్యల మీద, పల్లె పట్నం బతుకు చిత్రాన్ని కవితాత్మకంగా చెప్పే ప్రయత్నం చేశాడు అలిశెట్టి ప్రభాకర్. తన జీవితాన్ని కళకే అంకితం చేసిన కవి. అలిశెట్టి కుటుంబం పేదరికంతో బాధ పడుతున్నారని తెలుసుకున్న కేసీఆర్ సాయం చేయాలని ఆదేశించారు.
Also Read : Raghu Veera Reddy : బాబు అరెస్ట్ వెనుక బీజేపీ హస్తం