లక్షకు పైగా నేతన్నల కుటుంబాల్లో ఉచిత విద్యుత్ వెలుగులు

15 శాతం సబ్సిడీకే నూలు 90 శాతం సబ్సిడీతో ఆధునిక పనిముట్లు

అమరావతి : కూటమి ప్రభుత్వం రాక నిస్తేజంలో కూరుకు పోయిన నేతన్నకు భరోసానిచ్చింది. గత రెండేళ్ల కాలంలో చేనేత రంగ అభివృద్ధికి, నేతన్నల సంక్షేమానికి కూటమి ప్రభుత్వం తీసుకున్న చర్యలతో అంపశయ్యపై ఉన్న చేనేత పరిశ్రమ అభివృద్ధి పథంలోకి పయనించ సాగింది. ఒకవైపు నూతన టెక్స్ టైల్స్ పాలసీ, మరోవైపు వ్యక్తిగత లబ్ధి పొందేలా పథకాల అమలు, ఇంకోవైపు చేనేత సహకార సంఘాల బలోపేతానికి చర్యలతో డీలా పడిన చేనేత రంగానికి కూటమి ప్రభుత్వం జవసత్వాలు నింపింది. నేను కూలీని కాదు కళాకారుడిని అని నేతన్నలు కాలెరగేసేలా కూటమి ప్రభుత్వం రెండేళ్ల పాలన వారిలో ఆత్మవిశ్వాసాన్ని నింపింది, ఆత్మగౌరవాన్ని ఇచ్చింది. చేనేత రంగాన్ని ఆదుకున్న ఎన్టీఆర్ స్ఫూర్తితో పాలన సాగిస్తున్న సీఎం చంద్రబాబు నాయుడు సైతం నేతన్నలకు లబ్ధి కలిగేలా ఎన్నో నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఇక మంత్రి నారా లోకేష్ తీసుకున్న చొరవతో మంగళగిరి చేనేతకు అంతర్జాతీయ గుర్తింపు, గౌరవం దక్కింది.

2024లో సీఎం చంద్రబాబు నేతృత్వంలో ఏర్పడిన ఎన్డీయే ప్రభుత్వం చేనేతలకు అండగా నిలిచింది. ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల కింద 92,724 మంది నేతన్నలకు రూ.3 వేల నుంచి రూ. 4 వేలకు పెన్షన్ పెంచారు. చేనేతలకు త్రిఫ్ట్ కింద ప్రభుత్వ వాటాను 8 నుంచి 16 శాతానికి పెంచారు. ఈ పథకం కింద 2024-25లో రూ.5 కోట్లు, 2025-26లోనూ మరో రూ.5 కోట్లు కేటాయించారు. త్రిఫ్ట్ పథకం ద్వారా 5,726 మందికి లబ్ధి కలిగింది. రెండేళ్లలో రూ.65.35 కోట్ల మేర ముద్ర రుణాలను 6,808 మందికి అందజేశారు. జాతీయ చేనేత అభివృద్ధి కార్యక్రమం (ఎన్.హెచ్.డి.పి) పథకం ద్వారా చిన్న క్లస్టర్ అభివృద్ధి కార్యక్రమాలకు రూ.10.44 కోట్లను వెచ్చించగా, 7,500 మంది చేనేతలకు లబ్ధి కలిగింది. రూ.175 కోట్లతో ముడి పదార్థాల సరఫరా పథకం ద్వారా నూలు కొనుగోలుపై 15 శాతం సబ్సిడీ అందజేశారు. ఎన్నికల్లో హామీ ఇచ్చిన విధంగా చేనేత ఉత్పత్తుల 5 శాతం జీఎస్టీ రియింబర్స్ మెంట్ ఇవ్వాలని సీఎం చంద్రబాబు నిర్ణయించారు. స్వయం సహాయక సంఘాల్లో ఉన్న చేనేత మహిళలకు రూ.10 వేలు విలువ చేసే నూలును అందజేస్తున్నారు. 2024 ఏప్రిల్ నుంచి 109 ప్రాథమిక చేనేత సహకార సంఘాలకు రూ.78.73 కోట్ల నగదు పరపతి సౌకర్యం కల్పించారు. ఆధునిక పనిముట్ల కొనుగోలుకు 90 శాతం వరకు సబ్సిడీతో పాటు క్యాష్ క్రెడిట్ పథకం కింద సహకార సంఘాలకు బ్యాంకు రుణాలు అందజేస్తున్నారు.

Leave A Reply

Your Email Id will not be published!