జాతి ప్రయోజనాల విషయంలో రాజకీయాలకు తావు లేదు

ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేసిన సీఎం అనుముల రేవంత్ రెడ్డి

హైద‌రాబాద్ : దేశ భద్రత, జాతి ప్రయోజనాల విషయంలో రాజకీయాలకు తావు లేదని అన్నారు సీఎం ఎ. రేవంత్ రెడ్డి. ఎన్నికల సమయంలోనే రాజకీయాలు మిగ‌తా స‌మ‌యాల్లో ఉండ‌వ‌న్నారు. గురువారం హైద‌రాబాద్ వేదిక‌గా జ‌రిగిన ఇండియన్ రోడ్స్ కాంగ్రెస్ లో సీఎం పాల్గొని ప్ర‌సంగించారు. ఘన చరిత్ర కల్గిన హైదరాబాద్ కు విచ్చేసిన అతిథులకు స్వాగతం ప‌ల‌క‌డం ఆనందంగా ఉంద‌న్నారు. 2047 మనకు ఎంతో ప్రాధాన్యమున్న సంవత్సరం అని చెప్పారు. అప్పటికి దేశానికి స్వాతంత్ర్యం వచ్చి వందేళ్లు అవుతుందన్నారు సీఎం. 2047 నాటికి తెలంగాణను 3 ట్రిలియన్ డాలర్ల ఎకానమీగా మార్చనున్నాం అని ప్ర‌క‌టించారు. తెలంగాణను 3 భాగాలుగా విభజించాం అని తెలిపారు . క్యూర్ – ఓఆర్ఆర్ పరిధిలోని ఈ ప్రాంతంలో సేవా రంగాలకు ప్రాధాన్యం ఇస్తాం అని ప్ర‌క‌టించారు.

ప్యూర్ ఓఆర్ఆర్ నుంచి ఆర్ఆర్ఆర్ వరకు ఉన్న ప్రాంతంలో తయారీ రంగానికి ప్రాధాన్యం ఉంటుందన్నారు ఎ. రేవంత్ రెడ్డి. రేర్ ఆర్ఆర్ఆర్ వెలుపల ప్రాంతాన్ని వ్యవసాయం, వ్యవసాయ పరిశ్రమలకు ప్రాధాన్యం ఇస్తాం అన్నారు . మా ఆర్ అండ్ బీ శాఖ అనేక శాఖల పనులు చేపడుతోందని చెప్పారు. మేం రహదారులతో పాటు ఇతర మౌలిక వసతులకు ప్రాధాన్యం ఇస్తున్నాం అని తెలిపారు.
రాష్ట్రంలో నూతన ఉస్మానియా, టిమ్స్ ఇతర ఆసుపత్రుల్లో కలిపి 8000 బెడ్స్ అందుబాటులోకి తెస్తున్నాం అని వెల్ల‌డించారు సీఎం. రాష్ట్రంలో చేపట్టాల్సిన పనులను మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తెలిపార‌ని వీటికి ఆమోదం తెలపాల‌ని కేంద్ర మంత్రి నితిన్ గ‌డ్క‌రీని కోరారు సీఎం. డిసెంబరు 7, 8, 9 తేదీల్లో ఇన్వెస్ట్ తెలంగాణ గ్లోబల్ సమ్మిట్ నిర్వహించ బోతున్నాం అని వెల్ల‌డించారు.

Leave A Reply

Your Email Id will not be published!