Tirumala Hundi : శ్రీవారి హుండీ ఆదాయం రూ. 3.37 కోట్లు
దర్శించుకున్న భక్తులు 56,723
Tirumala Hundi : తిరుమల – కోరిన కోర్కెలు తీర్చే కొంగు బంగారంగా పేరు పొందిన పుణ్య క్షేత్రం తిరుమలలో భక్తుల రద్దీ యధావిధిగా కొనసాగుతోంది. కరోనా తర్వాత భారీ ఎత్తున భక్తులు శ్రీవారి దర్శనం కోసం తరలి వస్తున్నారు. ఇందులో భాగంగా సుదూర ప్రాంతాల నుంచి ఎంతో వ్యయ ప్రయాసల కోర్చి వచ్చే భక్త బాంధవులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా వసతి సౌకర్యాలను కల్పించనున్నట్లు తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) కార్య నిర్వహణ అధికారి ఏవీ ధర్మా రెడ్డి వెల్లడించారు.
Tirumala Hundi Updates
కొలువు తీరిన శ్రీ వేంకటేశ్వర స్వామి, శ్రీ అలివేలు మంగమ్మలను 56 వేల 723 మంది భక్తులు దర్శించుకున్నారు. 21 వేల 778 మంది తలనీలాలు సమర్పించారు. భక్తులు నిత్యం సమర్పించే కానుకలు, విరాళాల రూపేణా శ్రీవారి హుండీ ఆదాయం రూ. 3.37 కోట్లు వచ్చినట్లు టీటీడీ(TTD) ఈవో తెలిపారు.
ఇక శ్రీవారి దర్శనం కోసం తిరుమల లోని 13 కంపార్ట్ మెంట్లలో వేచి ఉన్నారు. ఎలాంటి టోకెన్లు లేకుండా సర్వ దర్శనం కోసం వేచి ఉన్న భక్తులకు కనీసం 8 గంటలకు పైగా సమయం పట్టే అవకాశం ఉందని స్పష్టం చేసింది తిరుమల తిరుపతి దేవస్థానం.
శ్రీవారి దర్శనం కోసం వచ్చే భక్తులకు ఎలాంటి కష్టం లేకుండా విశిష్ట సేవలు అందజేస్తున్నారని శ్రీవారి సేవకులను ప్రశంసించారు టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి.
Also Read : CM KCR Comment : ‘సింహం’ గెలుస్తుందా నిలుస్తుందా