హైదరాబాద్ : విలక్షణ నటుడు దుల్కర్ సల్మాన్. ఇక అద్బుతమైన నటిగా గుర్తింపు తెచ్చుకుంది పూజా హెగ్డే. తను ముంబైకి చెందినప్పటికీ తొలుత తమిళ చలన చిత్ర పరిశ్రమ ద్వారా పరిచయం అయ్యింది. ఆ తర్వాత తెలుగు చలన చిత్ర పరిశ్రమ ఆదరించింది. గోపికమ్మా అంటూ పాడిన పాటకు తను చేసిన డ్యాన్స్ అదుర్స్ అనిపించేలా చేసింది. ఆ తర్వాత వరుస విజయాలతో దుమ్ము రేపింది. టాలీవుడ్ లో టాప్ హీరోస్ అందరితో కలిసి నటించింది పూజా హెగ్డే. ముఖ్యంగా బన్నీతో కలిసి దువ్వాడ జగన్నాథంతో పాటు అల వైకుంఠపురంలో నటించింది. రెండు సినిమాలు అత్యంత జనాదరణను పొందాయి. తాజాగా దుల్కర్ సల్మాన్ తో భిన్నమైన కథతో వస్తున్న మూవీలో ముఖ్య పాత్రను పోషిస్తోంది పూజా హెగ్డే. ఇప్పటి వరకు పేరు పెట్టని సినిమాకు మూవీ మేకర్స్ ఇవాళ టైటిల్ ను ఖరారు చేశారు. ఈ సినిమాకు ప్రముఖ సినీ, విప్లవ కవి శ్రీశ్రీ పేరును పెట్టారు.
‘శ్రీ శ్రీ’తో ప్రేమ మరింత ప్రత్యేకంగా అనిపిస్తుంది. ఈ సినిమాకు రవి నేలకుడితి దర్శకత్వం వహిస్తున్నాడు. తన దర్శకత్వంలో రూపొందిన ‘శ్రీ శ్రీ’ చిత్రం త్వరలో థియేటర్లలో విడుదల కానుంది. దుల్కర్ సల్మాన్, పూజా హెగ్డే జంటగా నటిస్తున్న ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న చిత్రానికి సంబంధించిన టైటిల్‌ను చిత్ర బృందం ఈ రోజు అధికారికంగా ప్రకటించింది. ఇంతకుముందు ఈ చిత్రానికి ‘DQ41’ అనే తాత్కాలిక పేరును పెట్టారు. శ్రీ శ్రీతో ప్రేమ మరింత ప్రత్యేకంగా అనిపిస్తుంది అనే క్యాప్షన్‌తో దుల్కర్ సల్మాన్ ఈ విషయాన్ని తన సోషల్ మీడియా ఖాతాలో పంచుకున్నారు. ఈ సినిమా టైటిల్ DQ అభిమానులనే కాకుండా ఇతరులను కూడా ఆకట్టుకుంటోంది.
