Gauri Lankesh : గౌరీ లంకేశ్ కు నివాళి
ఆమె జ్ఞాపకం పదిలం
Gauri Lankesh : కర్ణాటక – గౌరీ లంకేశ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సింది ఏమీ లేదు. కర్ణాటకలో పేరు పొందిన జర్నలిస్ట్. అంతకు మించిన రచయిత. ఆమెను దారుణంగా హత్య చేశారు ఫాసిస్టు మూకలు. ఆమె ఈ లోకాన్ని వీడి సరిగ్గా ఆరేళ్లవుతోంది. జనవరి 29, 1962లో పుట్టారు. సెప్టెంబర్ 5, 2017లో చని పోయారు.
Gauri Lankesh Great Person
మానవ హక్కుల కోసం మద్దతుగా నిలిచిన గొప్ప వ్యక్తి. తండ్రి లంకేశ్ పేరుతో పత్రిక నడిపారు. చిన్నప్పటి నుంచి గౌరీ లంకేశ్(Gauri Lankesh) కు జర్నలిజం అంటే మక్కువ. ఇంగ్లీష్, కన్నడ పత్రికల్లో పని చేశారు. ప్రజా సమస్యలను ప్రస్తావించారు.
ఎక్కువగా కథనాలు రాశారు. మితవాదులు, హిందూత్వ వాదులపై లౌకిక కోణంలో విమర్శించారు. నక్సలైట్ల సానుభూతి పరురాలిగా గుర్తింపు పొందారు. టైమ్స్ ఆఫ్ ఇండియాలో పని చేశారు. గౌరీ లంకేష్ పేరుతో పలు ప్రచురణలు ప్రారంభించారు.
ధైర్యవంతురాలిగా, ముక్కు సూటిగా ప్రశ్నించే జర్నలిస్టుగా పేరు పొందారు. ప్రముఖ దర్శకురాలు కవితా లంకేశ్ ఆమె సోదరి. తండ్రి వామపక్ష కవి, రచయిత కూడా. గౌరీ లంకేశ్ మూఢాచారాలకు వ్యతిరేకంగా కలాన్ని ఝులిపించారు.
కన్నడ నాట జరిగిన ప్రజా ఉద్యమాలలో కీలక పాత్ర పోషించారు. లింగాయత్ వాదానికి వెన్ను దన్నుగా నిలిచారు. మత సామరస్య సాధనకు ప్రయత్నించారు దళిత యువజన కార్యకర్త జిగ్నేశ్ మేవానీ, కన్నయ్య లాల్ ను తన దత్త పుత్రులని పేర్కొన్నారు.
Also Read : Udhayanidhi Stalin : బెదిరింపులకు భయపడను – ఉదయనిధి