TS TET: తెలంగాణా టెట్‌ ఫీజు భారీగా పెంపు ! ప్రభుత్వ నిర్ణయం నిరుద్యోగుల అసంతృప్తి !

తెలంగాణా టెట్‌ ఫీజు భారీగా పెంపు ! ప్రభుత్వ నిర్ణయం నిరుద్యోగుల అసంతృప్తి !

TS TET: మెగా డిఎస్సీ నిర్వహణకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో టీచర్ ఎలిజబులిటీ టెస్ట్ (టెట్) నిర్వహణకు తెలంగాణా విద్యా శాఖ నోటిఫికేషన్ జారీ చేసింది. అయితే ఈ టెట్‌ దరఖాస్తు ఫీజును విద్యాశాఖ భారీగా పెంచింది. గతంలో టెట్(TS TET) కు సంబంధించి ఒక పేపర్‌ రాస్తే రూ. 200 రుసుము ఉండగా… దాన్ని తాజాగా రూ. 1,000 కి పెంచింది. రెండు పేపర్లు రాస్తే గతంలో రూ. 300 రుసుము ఉండగా… దాన్నిఇప్పుడు రూ.2,000కు పెంపుదల చేసింది. ఈ మేరకు టెట్‌ కు సంబంధించిన ఇన్ఫర్మేషన్ నోటిఫికేషన్ లో టెట్ పరీక్ష నిర్వహణకు సంబంధించి అర్హత, పరీక్ష కేంద్రాలు, ఫీజు వివరాలను పొందుపరచింది. అయితే టెట్ ఫీజును భారీగా పెంచడంపై నిరుద్యోగులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల ఏపీ ప్రభుత్వం నిర్వహించిన టెట్ కు కూడా ఇదే విధంగా ఫీజులు వసూలు చేయడంతో… ఏపీ ప్రభుత్వాన్ని తెలంగాణా ప్రభుత్వాన్ని అనుసరిస్తుందంటూ విమర్శిస్తున్నారు.

TS TET Updates

టెట్‌-2024 కోసం ఈ నెల 15న నోటిఫికేషన్‌ విడుదలైన విషయం తెలిసిందే. ఈ నెల 27 నుంచి వచ్చే నెల పదో తేదీ వరకు https://schooledu.telangana.gov.in వెబ్‌సైట్‌ ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తులను స్వీకరిస్తారు. ఈ సమయంలో సహాయ కేంద్రం సేవలు సైతం అందుబాటులో ఉంటాయని విద్యాశాఖ పేర్కొంది. మే 15 నుంచి హాల్‌టికెట్లను డౌన్‌ లోడ్‌ చేసుకోవచ్చు. కంప్యూటర్‌ బేస్డ్ టెస్ట్ (సీబీటీ) ద్వారా పరీక్షలను మే 20 నుంచి జూన్‌ మూడో తేదీ వరకు నిర్వహిస్తామని విద్యాశాఖ ప్రకటించింది. పేపర్‌-1 ఉదయం 9 గంటల నుంచి 11.30 వరకు, పేపర్‌-2 మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 4.30 వరకు ఉంటుందని తెలిపింది. పరీక్ష ఫలితాలు జూన్‌ 12న విడుదలవుతాయని పేర్కొంది. అభ్యర్థులు పేపర్‌-1, పేపర్‌-2లలో ఏదేని ఒక పరీక్ష రాస్తే రూ. 1,000, రెండు పేపర్లూ రాస్తే రూ. 2,000 చెల్లించాలని విద్యాశాఖ సూచించింది. టెట్‌ను 11 జిల్లా కేంద్రాల్లో నిర్వహిస్తామని తెలిపింది.

Also Read : HP Rebal MLAs : హిమాచల్ ప్రదేశ్ లో కాంగ్రెస్ కి షాక్ ఇచ్చి బీజేపీలో చేరిన 6 రెబల్ ఎమ్మెల్యేలు

Leave A Reply

Your Email Id will not be published!