TSPSC Chairman : హైదరాబాద్ – అవినీతి, అక్రమాలకు కేరాఫ్ గా మారిన తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్పీఎస్సీ) లో కీలక పరిణామం చోటు చేసుకుంది. నిన్నటి దాకా చైర్మన్ పదవిని అంటి పెట్టుకుని అధికార దర్పాన్ని ప్రదర్శించిన జనార్దన్ రెడ్డి ఎట్టకేలకు తనంతకు తానుగా రాజీనామా చేశారు. ఆయన నేరుగా గవర్నర్ తమిళి సై సౌందర రాజన్ ను కలుసుకున్నారు.
TSPSC Chairman Resignation Viral
తానే స్వయంగా తాను రాజీనామా చేస్తున్నానని, ఆమోదించాలని కోరడం విశేషం. ఆయన రాజీనామా పత్రాన్ని ఇచ్చిన వెంటనే గవర్నర్ ఆమోదించారు. దీంతో నిరుద్యోగులు పండుగ చేసుకున్నారు., స్వీట్లు పంచుకున్నారు. జనార్దన్ రెడ్డి(Janardhan Reddy) పీడ విరుగడైందని శాపనార్థాలు పెట్టారు.
గతంలో కేసీఆర్ సర్కార్ ఏరికోరి జనార్దన్ రెడ్డిని చైర్మన్ గా నియమించింది. అంతకు ముందు చైర్మన్ గా ఉన్న ఘంటా చక్రపాణి హయాంలో సైతం అక్రమాలు జరిగాయన్న ఆరోపణలు వచ్చాయి. రాజీనామా చేసే కంటే ముందు జనార్దన్ రెడ్డి సీఎం రేవంత్ రెడ్డిని కలుసుకున్నారు. టీఎస్పీఎస్సీకి సంబంధించి పూర్తి వివరాలు అందజేశారు.
అయితే దీంతో సంతృప్తి చెందని సీఎం సీరియస్ అయినట్లు సమాచారం. అంతే కాదు స్వచ్చంధంగా రాజీనామా చేయాలని లేక పోతే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని పేర్కొనడంతో గత్యంతరం లేక తన పదవికి రాజీనామా చేసినట్లు సమాచారం.
Also Read : Tammineni Sitaram : ఆర్కే రాజీనామాను ఆమోదించలేం