TSPSC Group1 Prelims : ఎట్టకేలకు గ్రూప్ -1 పరీక్ష తేదీ ఖరారు
అక్టోబర్ 16న ప్రిలిమ్స్ పరీక్ష
TSPSC Group1 Prelims : ఇప్పటికే పెద్ద ఎత్తున దరఖాస్తు చేసుకున్నా టీఎస్పీఎస్సీ ప్రకటించిన గ్రూప్ -1 పోస్టుల కోసం. నాన్చుతూ వచ్చారు. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న 2 లక్షల పోస్టులలో కేవలం 90 వేల పోస్టులు మాత్రమే ఉన్నాయంటూ సెలవిచ్చారు సీఎం కేసీఆర్.
పోనీ ప్రకటించిన పోస్టులకైనా ఇప్పటి వరకు నోటిఫికేషన్లు ఇచ్చారా అంటే అదీ లేదు. కేవలం కొన్ని మాత్రమే ప్రకటించారు. ఈరోజు వరకు పూర్తి నోటిఫికేషన్లు రాలేదు.
అవి రావాలంటే ఇంకా కొంత సమయం పడుతుందని అంచనా. తాజాగా పబ్లిక్ సర్వస్ కమిషన్ గ్రూప్ -1(TSPSC Group1 Prelims) కి సంబంధించి కీలక ప్రకటన చేసింది. ఈ మేరకు ప్రిలిమ్స్ పరీక్ష అక్టోబర్ 16న నిర్వహించనున్నట్లు వెల్లడించింది.
మెయిన్స్ ఎగ్జామ్ వచ్చే ఏడాది జనవరి లేదా ఫిబ్రవరిలో ఉండవచ్చని అంచనా. ఇప్పటికే వేలాది మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. ఇంకా గ్రూప్ -2 పోస్టులకు సంబంధించి నోటిఫికేషన్ ఇవ్వలేదు.
దానిపై ఇంకా ఊసే లేదు. ఇక యూనివర్శిటీలలో బోధన, బోధనేతర పోస్టులు 3 వేల దాకా ఉన్నాయి. వాటి గురించి అడిగే నాథుడే లేకుండా పోయారు.
ముందే నిర్వహించాలని అనుకున్నప్పటికీ ఇతర పరీక్షలు ఉన్నందు వల్ల తేదీ ఆలస్యంగా ప్రకటించామన్నారు కార్యదర్శి అనితా రామచంద్రన్. మొత్తం 503 పోస్టులకు నోటిఫికేషన్ ఇచ్చారు.
ఇందులో 3,02,912 దరఖాస్తులు వచ్చాయి. తెలంగాణలోనే భారీగా దరఖాస్తు చేసుకున్నారు. ఈ మేరకు గడువు ఉండడంతో చదువుకునేందుకు టైం దొరుకుతుందని పేర్కొన్నారు చైర్మన్ జనార్దన్ రెడ్డి.
ఆర్థిక శాఖ క్లియరెన్స్ ఇచ్చినా ఇతర పోస్టులకు సంబంధించి నోటిఫికేషన్లు ఇవ్వక పోవడంపై నిరుద్యోగులు మండి పడుతున్నారు.
Also Read : ఓయూ సంచలన నిర్ణయం