Upasana Taku : డిజిట‌ల్ రంగం ఉప‌స‌నా త‌కు విజ‌యం

మొబిక్విక్ తో బిలియ‌న్ డాల‌ర్ల వ్యాపారం

Upasana Taku : ఏ వ్యాపార‌మైనా చిన్న గ‌దిలో ప్రారంభం అవుతుంది. దేశంలో లెక్క‌లేనంత మంది కొత్త‌గా త‌మ త‌మ రంగాల‌లో స‌క్సెస్ కోసం ప్ర‌య‌త్నాలు చేస్తూ వ‌స్తున్నారు. ప్ర‌స్తుతం డిజిట‌ల్ రంగం కీల‌కంగా మారింది. ఎప్పుడైతే న‌రేంద్ర మోదీ పీఎంగా కొలువుతీరారో ఆనాటి నుంచి డిజిట‌ల్ సెక్టార్ కు ప్ర‌యారిటీ ఇస్తూ వ‌స్తున్నారు. అందులో భాగంగా మ‌హిళ‌లకు ఎక్కువ ప్రాధాన్య‌త ఇచ్చారు.

స‌బ్సిడీ కూడా ఇస్తుండ‌డంతో కొత్త‌గా వ్యాపారాలు ప్రారంభిస్తున్నారు. ఇందులో భాగంగా ఉప‌స‌నా త‌కు బిలియ‌న్ డాల‌ర్ల వ్యాపారాన్ని సృష్టించింది. మొబిక్విక్ , జాక్పే కో ఫౌండ‌ర్ . మొబిక్విక్ అనేది చెల్లింపు సంస్థ‌. ఇది మొబైల్ ఆధారిత చెల్లింపు వ్య‌వ‌స్థ‌. డిజిట‌ల్ వాలెట్ ను అందజేస్తుంది.

ఉప‌స‌నా త‌కు(Upasana Taku) గుజ‌రాత్ లోని సూర‌త్ లో విద్య‌ను పూర్తి చేశారు. ఆపై పారిశ్రామిక ఇంజ‌నీరింగ్ కోసం జ‌లంధ‌ర్ లోని నేష‌న‌ల్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ టెక్నాల‌జీలో చ‌దువుకున్నారు. అనంత‌రం యునైటెడ్ స్టేట్స్ లోని స్టాన్సోర్డ్ విశ్వ విద్యాల‌యం నుండి మేనేజ్ మెంట్ సైన్స్ ,

ఇంజ‌నీరింగ్ లో మాస్ట‌ర్స్ డిగ్రీ పొదారు. ఉప‌స‌నా త‌కు మొద‌ట శాన్ డియాలోగా హెచ్ఎస్ బీసీతో క‌లిసి ప‌ని చేసింది. త‌ర్వాత పే పాల్ లో కొంత కాలం పాటు సేవ‌లు అందించింది. 2009లో జ‌క్పేను స్థాపించింది.

అదే స‌మ‌యంలో ఆమె పిప్పెన్ ను క‌లుసుకుంది. స్టార్ట‌ప్ ప‌ర్యావ‌ర‌ణ వ్య‌వ‌స్థ‌ను మెరుగు ప‌ర్చేందుకు ఆస‌క్తిగా ఉన్నాడ‌ని తెలుసుకుంది. మొబిక్విక్ కు కో ఫౌండ‌ర్ గా చేరింది. ప్ర‌స్తుతం 2.4 మిలియ‌న్ల మంది వినియోగ‌దారుల‌ను క‌లిగి ఉంది. ప్ర‌స్తుతం 181.2 మిలియ‌న్ డాల‌ర్ల వ్యాపారంతో న‌డుస్తోంది.

Also Read : వి’ హ‌బ్ నిర్మాణంలో దీప్తి కీల‌కం

Leave A Reply

Your Email Id will not be published!