VC Sajjanar : బస్సులను ధ్వంసం చేస్తే ఊరుకోం
మేనేజింగ్ డైరెక్టర్ వీసీ సజ్జనార్
VC Sajjanar : హైదరాబాద్ – తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీఎస్ఆర్టీసీ) మేనేజింగ్ డైరెక్టర్ వీసీ సజ్జనార్(VC Sajjanar) షాకింగ్ కామెంట్స్ చేశారు. ఎవరైనా సరే ప్రజలకు నిత్యం సేవలు అందిస్తున్న ఆర్టీసీ బస్సులపై దాడులు చేస్తే ఊరుకునే ప్రసక్తి లేదని హెచ్చరించారు.
VC Sajjanar Serious Warning
ఓ ఛానల్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న బిగ్ బాస్ రియాల్టీ షో సందర్బంగా కంటెస్టెంట్స్ ఫ్యాన్స్ మధ్య గొడవ చోటు చేసుకుంది. దీంతో హైదరాబాద్ లోని కృష్ణానగర్ అన్నపూర్ణ స్టూడియో సమీపంలో ఆర్టీసీ బస్సులపై కొందరు దాడి చేశారు. ఈ దాడిలో 6 బస్సులు ధ్వంసం అయినట్లు వెల్లడించారు ఎండీ సజ్జనార్.
ఈ ఘటనకు సంబంధించి జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్ లో ఆర్టీసీ అధికారులు ఫిర్యాదు చేయడం జరిగిందని తెలిపారు. సోమవారం ట్విట్టర్ వేదికా వీసీ సజ్జనార్ స్పందించారు. బాధ్యులపై చట్ట రీత్యా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఇదిలా ఉండగా వీసీ సీరియస్ కావడంతో పోలీసులు ఎఫ్ఐఆర్ కూడా నమోదు చేశారు.
దర్యాప్తు చేస్తున్నారని ఎండీ వెల్లడించారు. అభిమానం పేరుతో పిచ్చి పిచ్చి చేష్టలు మంచిది కాదని సూచించారు. ప్రజలను నిత్యం తమ తమ గమ్య స్థానాలకు చేర్చే బస్సులపై మీ ప్రతాపం చూపిస్తామంటే చూస్తూ ఊరుకోమంటూ హెచ్చరించారు వీసీ సజ్జనార్.
Allso Read : Lay Offs : ఐటీ ఉద్యోగులకు పింక్ స్లిప్ లు