ఐటీ దాడుల‌తో మాకు సంబంధం లేదు : ర‌కుల్ ప్రీత్

తీవ్ర భావోద్వేగంతో పోస్ట్ చేసిన వ‌ర్ధ‌మాన తార

ముంబై : తన కుటుంబంపై జరిగిన ఐటీ (ఆదాయ‌పు ప‌న్ను శాఖ‌) దాడుల గురించి రకుల్ ప్రీత్ సింగ్ భావోద్వేగానికి లోన‌య్యారు. ఈ సంద‌ర్బంగా ఇవాళ సోష‌ల్ మీడియాలో పంచుకున్నారు. నిర్మాత వాషు భగ్నానీకి సంబంధించిన ఆర్థిక లావాదేవీల వ్యవహారంలో ఇటీవల జరిగిన ఆదాయపు పన్ను శాఖ సోదాల నేపథ్యంలో నటి రకుల్ ప్రీత్ సింగ్ ఒక స్పష్టమైన ప్రకటన విడుదల చేశారు. ఈ విచారణకు తనకు ఎటువంటి సంబంధం లేదని, అలాగే అక్రమ ఆర్థిక లావాదేవీలు లేదా బినామీ ఆస్తులకు సంబంధించిన ఆరోపణలను ఆమె ఖండించారు. ఆర్థిక పరమైన అక్రమాలు జరిగాయన్న అనుమానాలతో బాలీవుడ్ ప్రముఖ నిర్మాత వాషు భగ్నానీ, పనోరమా స్టూడియోస్ , ఆయన కోడలు రకుల్ ప్రీత్ సింగ్‌లకు సంబంధించిన 12 ప్రాంతాల్లో ముంబై ఆదాయపు పన్ను శాఖ అధికారులు కొద్ది రోజుల క్రితం సోదాలు నిర్వహించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో వాషు భగ్నానీ ఆసుపత్రిలో చేరారని సమాచారం;

మీడియా ప్రతినిధులు కుటుంబాన్ని సంప్రదించడానికి ప్రయత్నించినప్పుడు, ఈ వ్యవహారం సద్దుమణిగే వరకు తమను ఒంటరిగా వదిలేయాలని వారు కోరారు. తాజాగా రకుల్ ప్రీత్ సింగ్ తన ట్విట్టర్ ఖాతా ద్వారా ఈ ఐటీ దాడుల గురించి ఒక సుదీర్ఘమైన పోస్ట్ చేశారు. తాను చట్టాన్ని గౌరవించే బాధ్యతాయుతమైన పౌరురాలినని అన్నారు. 20 ఏళ్ల వయసు నుండే క్రమం తప్పకుండా పన్నులు చెల్లిస్తున్నానని పేర్కొన్నారు. వాస్తవాలను సరి చూసుకోకుండా వార్తలను సంచలనాత్మకం చేసే ధోరణి కొందరు ఆన్‌లైన్ రిపోర్టర్లు , ప్రధాన స్రవంతి మీడియా జర్నలిస్టులలో పెరుగుతుండటం బాధాకరం అన్నారు ర‌కుల్ ప్రీత్ సింగ్. జరిగిన ఐటీ సోదాలు నాకు సంబంధించినవి కావు. నేను సాయుధ దళాల నేపథ్యం నుండి వచ్చానని, ఈ పరిశ్రమలో నాకు ఎటువంటి ‘గాడ్‌ఫాదర్’ లేరని తెలిపారు.

Leave A Reply

Your Email Id will not be published!