Lata Mangeshkar : భారత దేశానికి ఇవాళ చీకటి రోజు. సమున్నత భారతమంతా దిగ్గజ గాయని లేరన్న వార్తను జీర్ణించు కోలేక పోతోంది. 92 ఏళ్ల వయసున్న లతా మంగేష్కర్(Lata Mangeshkar) ఇక సెలవంటూ వెళ్లి పోయారు.
నైటింగేల్ ఆఫ్ ఇండియా పేరొందిన లతా దీదీ ఇక పాడలేనంటూ శాశ్వతంగా నిష్క్రమించారు. పాటతోనే ప్రారంభమై పాడుతూనే వెళ్లి పోవాలని తన కోరిక అంటూ చెప్పిన ఈ గాత్ర దిగ్గజం అందరినీ శోక సంద్రంలో ముంచి వెళ్లి పోయింది.
13 ఏళ్లకే తన కెరీర్ ను ప్రాంరభించిన ఆమె 70 ఏళ్లకు పైగా అప్రహతిహతంగా పాడుతూనే ఉన్నది. పాటే ప్రయాణమైన బతుకు ప్రస్థానంలో ఎన్నో అడ్డంకులు ఎదుర్కొని 36 భాషల్లో 50 వేలకు పైగా పాటలు పాడింది.
భారత సినీ దిగ్గిజ గాయని కోసం భారత ప్రభుత్వం ఆమెకు నివాళులు అర్పించింది. ఆమె చేసిన సేవలకు గాను దేశ వ్యాప్తంగా రెండు రోజుల పాటు సంతాప దినాలు ప్రకటించింది.
తనకు నోట మాట రావడం లేదని వాపోయారు ప్రధాని నరేంద్ర మోదీ. ఈ దేశం గొప్ప గాయనిని కోల్పోవడం విసాదకరమని పేర్కొన్నారు రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్. జీర్ణించుకోలేని విషాదమంటూ ఆవేదన వ్యక్తం చేశారు రాహుల్ గాంధీ.
మధ్య ప్రదేశ్ లో జన్మించినా మరాఠా మొత్తమే కాదు జాతి యావత్తు శోకంలో మునిగి పోయింది.
దేశంలోని వివిధ రంగాలకు చెందిన వారితో పాటు ఆయా పార్టీలకు చెందిన నేతలు, క్రీడాకారులు, సినీ రంగానికి చెందిన దిగ్గజాలు, ప్రముఖులు ఇలా వేలాది మంది లతా మంగేష్కర్ (Lata Mangeshkar)లేరన్న దానిని తట్టుకోలేక పోతున్నామని పేర్కొన్నారు.
Also Read : గాత్ర మాధుర్యం అజరామరం