Women’s Reservation Bill : నూతన పార్లమెంట్ లో మహిళా బిల్లు
ప్రవేశ పెట్టిన కేంద్ర మంత్రి మేఘా వాల్
Women’s Reservation Bill : న్యూఢిల్లీ – కేంద్రంలో కొలువు తీరిన మోదీ బీజేపీ సంకీర్ణ సర్కార్ సంచలన నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు మంగళవారం నూతన పార్లమెంట్ భవనంలోకి ప్రవేశించారు. పార్లమెంట్ ను ఉద్దేశించి ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రసంగించారు.
Women’s Reservation Bill on New Parliement
భారత దేశ చరిత్రలో ఇది నవశకానికి నాంది అని పేర్కొన్నారు. తమ ప్రభుత్వం అభివృద్ది, సంక్షేమం, సుపరిపాలన , డిజిటల్ టెక్నాలజీ, సమ న్యాయం లక్ష్యంగా పని చేస్తోందని చెప్పారు. ఈ సందర్బంగా కీలక ప్రకటన చేశారు. ఈ దేశపు అభివృద్దిలో కీలక పాత్ర పోషిస్తున్న మహిళలకు సంబంధించి రిజర్వేషన్ బిల్లును ప్రవేశ పెడుతున్నట్లు స్పష్టం చేశారు.
ఇందులో భాగంగా కేంద్ర మంత్రి మేఘావాల్(Meghawal) మహిళా బిల్లును ప్రవేశ పెట్టారు. దీనిపై ప్రతిపక్షాల సభ్యులు అభ్యంతరం తెలిపారు. తమకు ఎందుకు కాపీలు ఇవ్వలేదని ప్రశ్నించారు. అయితే బిల్లుకు సంబంధించి పూర్తి వివరాలు పార్లమెంట్ వెబ్ సైట్ లో అప్ లోడ్ చేశామని తెలిపారు కేంద్ర మంత్రి.
మహిళా బిల్లుపై చర్చించేందుకు గాను లోక్ సభ స్పీకర్ కీలక ప్రకటన చేశారు. ప్రస్తుతం లోక్ సభను వాయిదా వేస్తున్నట్లు తెలిపారు. సెప్టెంబర్ 20న బుధవారం చర్చించడం జరుగుతుందని వెల్లడించారు స్పీకర్ ఓం బిర్లా.
Also Read : Elon Musk : ట్విట్టర్ యూజర్లకు మస్క్ బిగ్ షాక్