Womens Reservation Bill : మహిళా బిల్లుకు ఆమోదం
లోక్ సభలో బంపర్ మెజారిటీ
Womens Reservation Bill : న్యూఢిల్లీ – మోదీ నేతృత్వంలోని బీజేపీ సంకీర్ణ సర్కార్ నూతన పార్లమెంట్ భవనం సాక్షిగా ప్రవేశ పెట్టిన మహిళా రిజర్వేషన్ బిల్లుకు ఎట్టకేలకు మోక్షం లభించింది. 2010లో ఆనాటి కాంగ్రెస్ సంకీర్ణ ప్రభుత్వ హయాంలో రాజ్యసభలో మహిళా బిల్లుకు ఆమోదం పొందింది.
Womens Reservation Bill Approved
తిరిగి దీనిని ప్రవేశ పెట్టారు నరేంద్ర మోదీ(PM Modi). వాదోపవాదాలు, చర్చల నడుమ మహిళా రిజర్వేషన్ బిల్లుకు అడ్డంకులు తొలగి పోయాయి. ఇది భారత దేశ చరిత్రలో ఓ నూతన అధ్యాయానికి తెర తీసినట్లు స్పష్టం చేశారు ప్రధాన మంత్రి నరేంద్ర దామోదర దాస్ మోదీ.
ఇదిలా ఉండగా మొదటగా లోక్ సభలో ప్రవేశ పెట్టారు బిల్లును. మొత్తం 545 మంది పార్లమెంట్ సభ్యులకు గాను 456 మంది హాజరయ్యారు. వీరిలో ఒక్కరు మాత్రమే వ్యతిరేకించగా 455 మంది మహిళా రిజర్వేషన్ బిల్లుకు ఆమోదం తెలిపారు.
ఎంఐఎం పార్టీకి చెందిన ఇద్దరు ఎంపీలు అసదుద్దీన్ ఓవైసీ, ఇంతియాజ్ జలీల్ లు మహిళా బిల్లుకు వ్యతిరేకంగా ఓటు వేశారు. మహిళల పట్ల ఎంఐఎం ఎలాంటి వ్యతిరేక వైఖరిని కలిగి ఉందో దీని ద్వారా తేలి పోయింది. ప్రజాస్వామ్య దేశంలో మహిళలు లేకుండా మనుగడ సాధించ లేమన్న డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ను విస్మరించడం దారుణం.
Also Read : ICC T20 World Cup USA : అమెరికాలో టి20 వరల్డ్ కప్