Womens Reservation Bill : బిల్లుకు ఆమోదం మోదీకి వందనం
పార్లమెంట్ లో నారీ శక్తి వందన్ చట్టం
Womens Reservation Bill : న్యూఢిల్లీ – భారత దేశంలో చరిత్రాత్మకమైన మహిళా బిల్లు ఆమోదం పొందింది. నిన్న లోక్ సభలో ఆమోదం పొందగా ఇవాళ రాజ్యసభలో సైతం ఆమోదం పొందడంతో ఇక నుంచి బిల్లు చట్టంగా కానుంది. రూ. 1200 కోట్లకు పైగా ఖర్చు చేసి నిర్మించిన పార్లమెంట్ భవనంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ మహిళా బిల్లును ప్రవేశ పెట్టారు లోక్ సభలో.
Womens Reservation Bill Viral
మొత్తం 545 ఎంపీలకు గాను 456 మంది హాజరయ్యారు. 454 సభ్యులు మహిళా రిజర్వేషన్ బిల్లుకు అనుకూలంగా ఓటు వేశారు. కేవలం ఇద్దరు సభ్యులు మాత్రం వ్యతిరేకంగా ఓటు వేశారు. వారెవరో కాదు ఎంఐఎం చీఫ్ , హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ, ఇదే పార్టీకి చెందిన ఇంతియాజ్ జలీల్ బిల్లుకు వ్యతిరేకంగా ఓటు వేటు వేశారు.
తాజాగా రాజ్యసభలో సైతం మహిళా బిల్లుకు ఆమోదం పొందింది ఈ మహిళా బిల్లు. ఈ సందర్బంగా నూతన పార్లమెంట్ లో అరుదైన, అద్భుతమైన సన్నివేశం చోటు చేసుకుంది. ఉభయ సభల్లో పార్లమెంట్ సభ్యులుగా ఉన్న మహిళలు ప్రధాన మంత్రి నరేంద్ర దామోదర దాస్ మోదీని(PM Modi) కలుసుకున్నారు.
బిల్లును ప్రవేశ పెట్టడం, ఆమోదం పొందిన సందర్బంగా పీఎంకు ధన్యవాదాలు తెలిపారు. తనను కలిసి అభినందించినందుకు పీఎం మహిళా ఎంపీలకు థ్యాంక్స్ చెప్పారు.
Also Read : Nara Chandra Babu Naidu : నా అరెస్ట్ అక్రమం..అన్యాయం