YSRC Leaders Satires: టీడీపీ-జనసేన ఉమ్మడి జాబితాపై వైసీపీ నాయకుల సెటైర్లు !
టీడీపీ-జనసేన ఉమ్మడి జాబితాపై వైసీపీ నాయకుల సెటైర్లు !
YSRC Leaders Satires: టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేనాని పవన్ కళ్యాణ్ విడుదల చేసిన మొదటి జాబితాపై అధికార వైసీపీ(YCP) నాయకులు సెటైర్లు వేస్తున్నారు. 175 స్థానాలకు గాను మొదటి జాబితాలో టీడీపీకు 94, జనసేనకు 24 సీట్లు కేటాయిస్తున్నట్లు ప్రకటించారు. అయితే చంద్రబాబు 94 మంది అభ్యర్ధులను ప్రకటించగా… జనసేనాని మాత్రం కేవలం 5గురు అభ్యర్ధులను మాత్రమే ప్రకటించారు. మిగిలిన అభ్యర్ధులను ఒకటి, రెండు రోజుల్లో ప్రకటిస్తామని తెలిపారు. అయితే పొత్తులో జనసేనకు కేవలం 24 అసెంబ్లీ, 3 లోక్ సభ స్థానాలు కేటాయించడంపై అధికార వైసీపీ(YCP) నాయకులు తమదైన శైలిలో సెటైర్లు వేస్తున్నారు.
YSRC Leaders Satires Viral
తిరుపతిలో నిర్వహించిన మీడియా సమావేశంలో మంత్రి రోజా మాట్లాడుతూ… “పవర్ స్టార్… పవర్ లేని స్టార్ అయ్యారు. ఎవరితో పొత్తుపెట్టుకోవాలో… ఎక్కడ నుంచి పోటీ చేయాలో తెలియని దుస్థితి పవన్ కళ్యాణ్ కు ఏర్పడింది. పవర్ షేరింగ్, సీట్ షేరింగ్ అన్నాడు. చివరకు పావలా షేర్ కూడా సీట్లు తెచ్చుకోలేదు. కుక్క బిస్కెట్లు వేస్తే తోక ఊపినట్లు 24 సీట్లకే పవన్ తల ఊపారో చెప్పాలి. ఏ ప్యాకేజీ కోసం 24 సీట్లకు తల వంచారో పవన్ చెప్పాలని అని మంత్రి రోజా డిమాండ్ చేసారు.
విశాఖలో మంత్రి గుడివాడ అమర్నాథ్ మాట్లాడుతూ… “తుప్పు పట్టిన సైకిల్, పగిలిపోయిన గ్లాసులకు గోల్డ్ కవరింగ్ ఇస్తూ… తాము బలంగా ఉన్నామన్న భ్రమలో జనసేన(Janasena), తెలుగుదేశం పార్టీలు ఉన్నాయి. గత ఐదేళ్లలో మా ప్రభుత్వం చేసిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజల ముందు ఉంచి మేము ఓట్లు అడుగుతున్నాము. అదే జనసేన, తెలుగుదేశం పార్టీలైతే… ఆ పార్టీల మధ్య ఉన్న పొత్తే బలమని భావిస్తూ ఎన్నికల బరిలోకి దిగుతున్నాయి. కేవలం 24 సీట్లు మాత్రమే జనసేనకి ఇచ్చి చంద్రబాబునాయుడు చేతులు దులుపుకుంటే… జనం కోరితే తాను ముఖ్యమంత్రి అవుతానని చెబుతూ వస్తున్న పవన్ కళ్యాణ్ ఈ సీట్లతో ఏ విధంగా ముఖ్యమంత్రి అవుతారని… ఆ పార్టీ కార్యకర్తలకు పవన్ కళ్యాణ్ ఏం సమాధానం చెబుతారని అమర్నాథ్ ప్రశ్నించారు.
మాజీ మంత్రి పేర్ని నాని మాట్లాడుతూ… “పవన్ కళ్యాణ్ సీటు కూడా చంద్రబాబునే డిసైడ్ చేస్తారు. జనసేన, టీడీపీ(TDP) కార్యకర్తలు త్యాగం చేయాలంట. చంద్రబాబు, పవన్ లు మాత్రం తమ కుటుంబాలకు మాత్రం సీట్లు పంచేసుకుంటారట. కాపులకు మరీ హీనంగా 7 సీట్లు ప్రకటించారు. చంద్రబాబు కులానికి 21 సీట్లు ఇచ్చుకున్నాడు. పవన్ కళ్యాణ్ నైజం ఇప్పుడు కాపులకు అర్థమైంది. ఇన్నాళ్లు మమ్మల్ని విమర్శించిన వాళ్లు ఇప్పుడు తల ఎక్కడ పెట్టుకుంటారంటూ మాజీ మంత్రి పేర్ని నాని ప్రశ్నించారు. చంద్రబాబు కోసమే పవన్ కళ్యాణ్ రాజకీయం చేస్తాడని… 24 సీట్లతో పవన్ కళ్యాణ్ కాపులకు రాజ్యాధికారం తెస్తాడా. పవన్ కళ్యాణ్ లెక్కలు చూస్తుంటే మంగళవారం సమేత గుర్తొస్తుంది. పొత్తులో ఉప పొత్తు బీజేపీతో పవన్ పెట్టుకుంటాడేమో’’ అంటూ ఎద్దేవా చేశారు.
మంత్రి అంబటి రాంబాబు మాట్లాడుతూ… “పవన్ కనీసం తన సీటును ప్రకటించుకోలేదు. ఎక్కడ పోటీ చేస్తారో ప్రకటించలేని స్థితిలో పవన్ ఉన్నారు. పొత్తుపై టీడీపీ-జనసేనకు క్లారిటీ లేదని… చంద్రబాబు, పవన్ కన్ఫ్యూజన్తో ఉన్నారని మంత్రి అంబటి రాంబాబు అన్నారు. బీజేపీ ఆశీస్సులున్నాయని పవన్ అన్నారు… కానీ బీజేపీ సింబల్ లేకుండానే పొత్తు ప్రకటన చేశారు. సీఎం అవుతానన్న పవన్ 24 సీట్లకు పరిమితమయ్యాడు. జనశ్రేణుల ఆత్మగౌరవాన్ని పవన్ దెబ్బతీశారు. పవన్ ది తిక్క లెక్క. పవన్ సీఎం అవుతారని కాపులు భావించారు. 24 సీట్లతో పవన్ సీఎం ఎలా అవుతారు. తన అభిమానులకు పవన్ వెన్నుపోటు పొడిశారు. పల్లకి మోసి పరువు పోగొట్టుకోవడం కంటే వీలీనం చేసి సినిమాలు తీసుకో’’ అంటూ పవన్ కు మంత్రి అంబటి సలహా ఇచ్చారు.
Also Read : Russia-Ukraine War : ఉక్రెయిన్ నుంచి రష్యా కు మల్లి యుద్ధ సంకేతాలు..వేల కోట్ల ఆస్తుల ధ్వంసం