5G Services : అక్టోబ‌ర్ నుంచి 5జీ సేవ‌లు షురూ

సిద్ద‌మ‌వుతున్న టెలికాం సంస్థ‌లు

5G Services : ఎంతో కాలం నుంచీ ఊరిస్తూ వ‌స్తున్న 5జీ సేవ‌లు ఇక త్వ‌ర‌లోనే దేశంలోని ప‌లు ప్రాంతాల‌లో అందుబాటులోకి రానున్నాయి. అదిగో ఇదిగో టచ్ చేస్తే చాలు ఇప్పుడున్న ఇంట‌ర్నెట్ వినియోగం కంటే అత్య‌ధిక వేగంగా వాడుకునే వీలు క‌లుగుతుంద‌ని దిగ్గ‌జ టెలికాం కంపెనీలు పేర్కొంటున్నాయి.

ఎట్ట‌కేల‌కు 5జీ సేవ‌ల విష‌యంపై క్లారిటీ వ‌చ్చింది. దేశంలో 5జీ సేవ‌లు(5G Services) వ‌చ్చే నెల అక్టోబ‌ర్ 1 నుంచి అందుబాటులోకి రానున్నాయి. ఆరోజు ఇండియా మొబైల్ కాంగ్రెస్ (ఐఎంఎస్) లో ఈ సేవ‌ల‌ను ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోదీ ప్రారంభించ‌నున్నారు.

దేశీయ డిజిట‌ల్ రంగంలో నూత‌న శ‌కం ప్రారంభం కానుంది. భార‌త దేశ చ‌రిత్ర‌లో ఇదో నూత‌న అధ్యాయం అంటూ ప్ర‌ధాన‌మంత్రి త‌న ట్విట్ట‌ర్ ఖాతాలో పేర్కొన్నారు. మ‌రో వైపు టెలికాంలోని కొన్ని కంపెనీలు మాత్రం ఇంకా తాము స‌న్న‌ద్ధం కాలేద‌ని ప్ర‌క‌టించ‌డం గంద‌ర‌గోళానికి దారితీసింది.

ఇదిలా ఉండ‌గా ఎయిర్ టెల్ కంపెనీ చైర్మ‌న్ భార‌తీ మిట్ట‌ల్ మాత్రం స‌రికొత్త విప్ల‌వం రాబోతోంద‌ని ప్ర‌క‌టించారు. ఇదో కొత్త అనుభ‌వం. మ‌రో వైపు కేంద్ర ఐటీ మంత్రి అశ్విని వైష్ణ‌వ్ మాత్రం వ‌చ్చే నెల 12 నుంచి దేశంలో 5జీ సేవ‌లు అందుబాటులోకి వ‌స్తాయ‌ని వెల్ల‌డించారు.

అయితే ఇందుకు సంబంధించి అప్ డేట్ కూడా ఇచ్చారు. ఇప్ప‌టికే ఇన్ స్టాలేష‌న్ పూర్త‌యింద‌ని టెలికాం సంస్థ‌లు 5జీ సేవ‌లు అందించేందుకు ప్ర‌య‌త్నం చేస్తున్నాయ‌ని వెల్ల‌డించారు వైష్ణ‌వ్.

కాగా 5జీ సేవ‌ల అందుబాటులోకి ఎప్పుడు వస్తాయ‌నే దానిపై వినియోగ‌దారులు వేచి చూస్తున్నారు.

Also Read : రూ. 400 కోట్లు దాటేసిన బ్ర‌హ్మాస్త్ర

Also Read : భార‌త్ లో ఐ ఫోన్ 14 త‌యారీకి రెడీ

Leave A Reply

Your Email Id will not be published!